Monday, April 29, 2024
Home ఆంధ్ర ప్రదేశ్ ఏపీసీపీఎస్‌ఈఏ నూతన కార్యవర్గం ఎన్నిక

ఏపీసీపీఎస్‌ఈఏ నూతన కార్యవర్గం ఎన్నిక

ఎంప్లాయీస్ వాయిస్ : ఏపీ సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌(ఏపీసీపీఎస్‌ఈఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా రొంగల అప్పలరాజు, ప్రధాన కార్యదర్శిగా కరి పార్థసారథి ఎన్నికయ్యారు. ఇప్పటివరకు అధ్యక్షుడిగా వ్యవహరించిన పాలేల రామాంజనేయులు గౌరవాధ్యక్షుడిగా.. ప్రధాన కార్యదర్శి బాజీ పఠాన్‌ గౌరవ సలహాదారుగా నియమితులయ్యారు. సోమవారం విజయవాడలో ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రచార కమిటీ ఛైర్మన్‌గా గంట శ్రీనివాసరావు, అదనపు ప్రధాన కార్యదర్శిగా కరిమి రాజేశ్వరరావు, ఉపాధ్యక్షుడిగా గురాన శ్రీనివాసరావు, మహిళా అధ్యక్షురాలిగా శైలజారాణి ఎన్నికయ్యారు.

డిసెంబరు 10న ఆందోళన

సీపీఎస్‌ను రద్దు చేయాలనే డిమాండ్‌తో డిసెంబరు 10న ‘హక్కుల సాధన పోరు’ పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టాలని కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆందోళన చేస్తున్నట్లు నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అప్పలరాజు, పార్థసారథి తెలిపారు. సీపీఎస్‌ను రద్దు చేస్తామంటూ ఇచ్చిన హామీని సీఎం జగన్‌ నిలబెట్టుకోవాలని.. లేని పక్షంలో ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...