Friday, April 26, 2024
Home జాతీయం ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త చేయాల‌ని ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ, ఈపీఎఫ్ఓ పోర్ట‌ల్ సర్వర్ డౌన్ అవ్వ‌డం స‌మ‌స్య‌గా మారింది. ఈ నేప‌థ్యంలో ప‌లువురు వినియోగ‌దారులు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని డిసెంబర్‌ 31 తర్వాత కూడా నామినీ వివరాలను అప్‌డేట్‌ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు ఈపీఎఫ్‌వో ఒక ట్వీట్ చేసింది.
పీఎఫ్ నామినేష‌న్ ఆన్‌లైన్‌లో దాఖ‌లు చేసే విధానం..

  1. ముందుగా epfindia.gov.in లో లాగిన్ అవ్వండి.
  2. స‌ర్వీసెస్ సెక్ష‌న్‌కి వెళ్లి ఫ‌ర్ ఎంప్లాయీస్‌ (For Employees) బ‌ట‌న్‌పై క్లిక్ చేయండి.
  3. ఆపై మెంబ‌ర్ యూఏఎన్ లేదా ఆన్‌లైన్ స‌ర్వీసెస్‌ (ఓసీఎస్‌/ఓటీసీపీ) బ‌ట‌న్‌పై క్లిక్ చేయండి.
  4. మీ యూఏఎన్‌, పాస్‌వ‌ర్డ్‌తో లాగిన్ చేయండి.
  5. మేనేజ్‌ బ‌ట‌న్ కింద ఈ-నామినేష‌న్‌ (E-Nomination) సెలెక్ట్ చేయండి.
  6. మీ ఫ్యామిలీ డిక్ల‌రేష‌న్ అప్‌డేట్ కోసం Yesపై క్లిక్ చేయండి.
  7. యాడ్ ఫ్యామిలీ డీటెయిల్స్‌ బ‌ట‌న్‌పై క్లిక్ చేసి వివ‌రాలు ఇవ్వండి.
  8. పీఎఫ్ మొత్తంలో ఎవ‌రెవ‌రికి ఎంతెంత మొత్తం ఇవ్వాలో తెలియ‌జేసేందుకు. .నామినేష‌న్ డీటెయిల్స్‌పై క్లిక్ చేయండి.
  9. డిక్ల‌రేష‌న్ ఇచ్చిన త‌ర్వాత‌ సేవ్ ఈపీఎఫ్ నామినేష‌న్ పై క్లిక్ చేయండి.
  10. ఓటీపీ కోసం E-Sign బ‌ట‌న్‌పై క్లిక్ చేయండి.
  11. ఆధార్ కార్డ్‌తో లింక్ చేసిన మీ మొబైల్ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది.
  12. ఓటీపీని ఎంట‌ర్ చేస్తే ఈపీఎఫ్‌లో మీ ఈ-నామినేష‌న్ న‌మోదు ప్ర‌క్రియ విజ‌య‌వంతం అవుతుంది.

ఈపీఎఫ్‌వో స‌భ్యులు త‌మ కుటుంబాల‌కు సామాజిక భ‌ద్ర‌త అందించ‌డానికి ఈ రోజే ఈ-నామినేష‌న్‌ను దాఖ‌లు చేయండి. నామినేష‌న్ డిజిట‌ల్‌గా దాఖ‌లు చేయ‌డానికి పైనున్న ద‌శ‌ల‌ను అనుస‌రించండి. స‌భ్యులు ఒక‌టి కంటే ఎక్కువ సార్లు పీఎఫ్ నామినీని జోడించొచ్చు. ఈపీఎఫ్ నామినేష‌న్ ఆన్‌లైన్‌లో దాఖ‌లు చేసిన త‌ర్వాత దీనికి సంబంధించిన ప‌త్రాల‌ను నేరుగా ఇవ్వ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు.

RELATED ARTICLES

అలసత్వం వద్దు… అప్రమత్తత ముద్దు

Omicron Variant: మొదటి, రెండో కరోనా వేవ్‌ నుంచి బయటపడ్డామని ఊరటగా ఉంటున్న సమయంలో మూడో వేవ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ రూపంలో ప్రపంచాన్ని వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో...

అరకొర పెన్షన్‌తో బతకలేకపోతున్నాం!

గౌరవనీయులైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి, ప్రైవేటు సెక్టారులోని విభిన్న కర్మాగారాలలో రేయింబవళ్లు శ్రమించి, దేశాభివృద్ధిలో మావంతు పాత్ర నిర్వహించి పదవీవిరమణ పొందిన కార్మికులమైన మేము...

బైకు కంటే విమానాలకే చీప్‌గా పెట్రోల్‌ ఎందుకు?

మళ్లీ పెరిగిన ఫ్యూయల్‌ ధరలు ఎంప్లాయిస్ వాయిస్ః చ‌మురు కంపెనీలకు కనికరం లేకుండా పోతుంది. గ్యాప్‌ లేకుండా పెట్రోలు...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...