Friday, April 26, 2024
Home ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్‌ ఉద్యోగుల‌ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి.

విద్యుత్‌ ఉద్యోగుల‌ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి.

విద్యుత్‌ సవరణ చట్టం 2020ని ఉపసంహరించుకోవాలని, జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంల ప్రైవేటీకరణ ఆపాలని, కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చెయ్యాలని, పీస్‌ రేట్‌ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్స్‌తో అక్టోబర్‌ 3న విజయవాడలో జరుగు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌, యునైటెడ్‌ ఎలక్ట్రిసిటి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీలు పిలుపునిచ్చారు. ఈ స‌భ‌కు ముఖ్య అతిధిగా ఎన్‌సిసిఓఇఇఇ జాతీయ కన్వీనర్ ప్రశాంత్‌.ఎన్‌.చౌదరి మాజీ శాస‌నస‌భ్యులు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. ఏ. గఫూర్ హాజ‌ర‌వుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ సవరణ చట్టం 2020 ని తీసుకు వచ్చింది. ఈ చట్టం వలన ఉత్పత్తి, సరఫరా పంపిణీలు కేంద్రం చేతిలోకి పోతాయి. డిస్కంలను ప్రవేటీకరించాలని అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కేంద్రం కోరింది. మొదట డిస్కంలను ప్రవేటికరించటం తదనంతరం ట్రాన్స్‌ మిషన్‌, జెన్కో స్టేషన్‌లను ప్రైవేటు కార్పోరేట్లకు కట్టబెట్టడం కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం. ఇదే జరిగితే విద్యుత్‌ సంస్థలోని ట్రాన్స్‌కో, జెన్‌కో డిస్కంల్లో పనిచేస్తున్న పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌ పీస్‌రేట్‌ ఉద్యోగులు ఉపాధి, ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి. తక్షణం కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల ఉద్యోగాలు ఊడిపోవటం ఖాయం. కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న విద్యుత్‌ సవరణ చట్టం రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించి వేయనుంది. విద్యుత్‌ ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో వుంది. కేంద్ర, రాష్ట్రాలు చట్టాలు చేసుకోవచ్చు. విద్యుత్‌ సవరణ చట్టం`2020 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాలకు అనుగుణంగా చట్టాలు చేసుకునే అవకాశం కోల్పోతాయి. రాష్ట్రాలు అధికారాలు కోల్పోతాయి. రాష్ట్ర పరిధిలో ఇప్పటివరకు ‘‘స్టేట్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్‌’’ విద్యుత్‌ను రెగ్యులేట్‌ చేస్తుంది. కమీషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. కేంద్ర చట్టం అమల్లోకి వస్తే రాష్ట్ర రెగ్యులేటరీ కమీషన్‌కు ఎటువంటి అధికారాలు వుండవు. డిస్కంలు పిపిఎ చేసుకొనే అధికారం ఉండదు. కేంద్రం బడా కార్పోరేట్లు అదానీ, అంబానీలతో ఒప్పందాలు చేసుకుంటుంది. రైతులకు, పేదలకు ఇచ్చే సబ్సీడీలు, రాయితీలు పోతాయి. సంస్కరణల వలన సబ్‌స్టేషన్స్‌ మానవరహిత ఆటోమిషన్‌ స్టేషన్స్‌గా మారతాయి. ఇప్పటికే జెన్కోల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. ఉపాధి, ఉద్యోగాలను కాపాడుకోవాలి. పర్మినెంట్‌ ఉద్యోగులకు 2022 ఏప్రిల్‌ 1న పిఆర్‌సి ప్రకటించాల్సి ఉంది. దీనికై పిఆర్‌సి కమిటిని నియమించాలి. 2020 జనవరి నుంచి రావాల్సిన 4 డిఏల కోసం మరియు ఇపిఎఫ్‌ నుండి జిపిఎఫ్‌లోకి మారుస్తామని ఇచ్చిన హామీ అమలుకు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలి.
కాంట్రాక్ట్‌ కార్మికులను క్రమబద్దీకరించాలి: గత ఎన్నికల ముందు ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో కార్మికులను క్రమబద్దీకరిస్తామని స్పష్టంగా హామీనిచ్చారు. కాంట్రాక్టు కార్మికులను క్రమబద్దీకరిస్తామని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సం॥లు అవుతున్నా ఇచ్చిన వాగ్ధానం అమలుకు చర్యలు శూన్యం. క్రమబద్దీకరణకై ప్రభుత్వం 6 మంది మంత్రులతో సబ్‌కమిటీని నియమించింది. ఈ కమిటీ అనేక సార్లు సమావేశం అయినప్పటికీ విద్యుత్‌ సంస్థలోని కార్మికులను పరిగణలోకి తీసుకోకపోవటం అన్యాయం. గత ప్రభుత్వం మాదిరిగా కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా విద్యుత్‌ సంస్థలోని కార్మికుందర్నీ సంస్థలో విలీనం చేసి అర్హత అనుభవంను బట్టి దశల వారీగా క్రమబద్దీ కరణకు వెంటనే చర్యలు చేపట్టాలి.
పీస్‌రేట్‌ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి: పీస్‌నేటు పద్ధతిలో పనిచేస్తున్న మీటర్‌ రీడర్లు, బిల్‌ కలెక్షన్‌ ఏజెంట్లు ఎస్‌పిఎం కార్మికులు, హమాలీలకు పీస్‌రేటు రద్దు చేసి కనీస వేతనం అమలు చేస్తామని, కాంట్రాక్టర్ల బెడద తొలగించి న్యాయం చేస్తామని స్వయంగా సిఎం అసెంబ్లీలో ప్రకటించినప్పటికీ అమలుకు నోచుకోలేదు. గత సంవత్సరం జరిగిన ఆందోళన సందర్భంగా ఎంవర్నీ తొలగించ వద్దని యాజమాన్యాలకు చెప్పినా ఆచరణలో పొమ్మనకుండా పొగబెట్టే విధంగా యాజమాన్యం వ్యవహరిస్తున్నది. ఎస్‌పిడిసిఎల్‌, సి.పి.డి.సి.ఎల్‌ పరిధిలో మీటర్‌ రీడ్లకు పని దినాలు తగ్గించడం, ఇస్తున్న పీస్‌రేట్లను కుదించడం, కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
అక్రమ తొలగింపులు అరికట్టాలి: వై.సి.పి ప్రభుత్వం అధికారంలోకి రాగానేకార్మికుల పట్ల కక్ష సాధింపు, అక్రమ తొటగింపులకు పాల్పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేరిన కార్మికులను తొలగించి తమకు లక్షల రూపాయలు లంచాలు ఇచ్చిన వారిని ఎమ్మెల్యేలు, అధికారులు నియామకాలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా మాచర్ల, గురజాల నియోజక వర్గాల్లో 35 మందిని తొలగించటం, నెల్లూరు జిల్లాలో 30 మంది, ప్రకాశంలో 15 మంది ట్రాన్స్‌కోలో కార్మికులు తొలగించారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి.

RELATED ARTICLES

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...