Sunday, April 28, 2024
Home తెలంగాణ‌ దళిత యువతిని పెళ్లాడినందుకు.. ఉద్యోగం నుంచి తొలగింపు

దళిత యువతిని పెళ్లాడినందుకు.. ఉద్యోగం నుంచి తొలగింపు

ఎంప్లాయిస్ వాయిస్ : ద‌ళిత యువతిని పెళ్లి చేసుకున్నాడనే కారణంతో.. దేవాలయంలో 14 ఏళ్లుగా పనిచేస్తున్న వ్యక్తిని ఉద్యోగంలోంచి తొలగించిన ఉదంతమిది. ఈ సంఘటన వనస్థలిపురం పోలీ స్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. నక్కా యాదగిరి గౌడ్‌ అనే వ్యక్తి 14 సంవత్సరాలుగా వనస్థలిపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ప్రసాదం కౌంటర్‌లో పనిచేస్తున్నారు. ఆయన ఆలయంలోని ఓ గదిలో ఉంటున్నారు. రెండు నెలల క్రితం ఆయన ప్రేమలత అనే దళిత యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు.
విషయం తెలుసుకున్న ఆలయ కమిటీ చైర్మన్‌ లక్ష్మయ్య, నిర్వాహకులు యాదగిరిని ఉద్యోగంలోంచి తీసేశారు. తన భర్తను విధుల్లోంచి తొలగించవద్దంటూ ప్రేమలత శనివారం లక్ష్మయ్య ఇంటికి వెళ్లి కోరగా.. కులం పేరుతో దూషించాడని బాధితురాలు పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు సత్యనారాయణ, చిరంజీవి, మేనేజర్‌ శ్రీహరి తమ అనుచరులతో కలిసి ఆలయంలో యాదగిరి ఉంటున్న ఇంటి తాళాలు బద్ధలు కొట్టి, సామాన్లు బయట పడేశారని వివరించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదుకు నిరాకరించారని, విషయం బయటకు పొక్కడంతో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టారని బాధితులు తెలిపారు.

RELATED ARTICLES

కాంట్రాక్టు ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు లైన్ క్లియ‌ర్‌

తెలంగాణ రాష్ట్రం లో ఉన్న వివిధ శాఖ లల్లో ప‌ని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు శుభ వార్త. వారిని క్ర‌మ‌బ‌ద్దీక‌రించ డానికి లైన్ క్లీయ‌ర్...

Entrepreneurial Advertising: The Future Of Marketing

We woke reasonably late following the feast and free flowing wine the night before. After gathering ourselves and our packs, we...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...