Saturday, April 27, 2024
Home ఆంధ్ర ప్రదేశ్ అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా నియమించడం కుద‌ర‌దు.

అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా నియమించడం కుద‌ర‌దు.

ఆలయాలు, మత సంస్థలకు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ వర్తించదు
వర్తింపజేస్తే ఇత‌ర మ‌తస్తులు రావొచ్చు
ఆ మతం ఆచరించనివారిని నియమించరాదని చట్టం చెబుతోంది
హైకోర్టు స్పష్టీకరణ.. దేవదాయ కమిషనర్‌ మెమో రద్దు.

AP High Court

దేవాలయాలు, ఇతర మత సంస్థల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పూర్తిస్థాయిలో వర్తించదని హైకోర్టు కీలక తీర్పుఇచ్చింది. దీనిని సంపూర్ణంగా వర్తింపజేస్తే. ఒక‌ మతాన్ని ఆచరించనివారు కూడా ఇంకో మ‌త ఆలయాల్లో ఉద్యోగులుగా నియమితుల య్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఏపీ దేవాలయ చట్టంలోని 13, 23, 29(3), 35 సెక్షన్ల ప్రకారం హిందూ మతం ఆచరించనివారిని ఆలయాల్లో ఉద్యోగులుగా నియమించరాదని గుర్తు చేసింది. రిజర్వేషన్‌కు సంబంధించి జీవోలు, సర్క్యులర్లను వర్తింపజేయడానికి దేవాలయాలు, హిందూ సంస్థలు ప్రభుత్వానికి చెందినవి కాదని పేర్కొంది. వాటిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ అవుట్‌ సోర్స్‌డ్‌(ఏపీసీవోఎస్‌) పరిధిలోకి తీసుకురావడానికి వీల్లేదని తేల్చిచెప్పింది.

ఏపీసీవోఎస్‌ ద్వారా అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఉద్యోగులను నియమించుకోవాలని దేవాలయాల ఈవోలను ఆదేశిస్తూ దేవదాయ కమిషనర్‌ గత ఏడాది జూలై 29న ఇచ్చిన మెమోను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి ఆర్‌.రఘునందనరావు ఇటీవల తీర్పు ఇచ్చారు. సదరు మెమోను సవాల్‌ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన న్యాయవాది శ్యాంప్రకాశ్‌ ముఖర్జీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వి.వేణుగోపాలరావు, దేవదాయ శాఖ తరఫునప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు.

RELATED ARTICLES

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...