Friday, March 29, 2024
Home కాంట్రాక్టు ఉద్యోగులు ఉద్యోగుల భద్ర‌త‌పై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ వెల్ల‌డి.

ఉద్యోగుల భద్ర‌త‌పై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ వెల్ల‌డి.

కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగ భద్రతపై అధికారులతో చర్చించిన తరువాత త్వరలోనే ప్రకటన చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. డిగ్రీ, జూనియర్‌ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలపై ఆ యూనియన్‌ సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో సోమవారం ఆయన చర్చలు జరిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై 2019 జులైలో వర్కింగ్‌ కమిటీని ఏర్పాటు చేశామని, కరోనా వల్ల పూర్తి స్థాయిలో చర్చలు జరగలేదన్నారు. ఉద్యోగ భద్రతకు తాము భరోసా ఇస్తామని, 2022 వరకు ఒప్పందం ఉందని తెలిపారు. ఈ లోపు ముఖ్యమంత్రితో చర్చించి తదుపరి విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. విద్యా వ్యవస్థలో ప్రైవేటు యాజమాన్యాల గుత్తాధిపత్యాన్ని లేకుండా చేసేందుకు కొన్ని సంస్కరణలు చేస్తున్నట్లు వివరించారు. ఎయిడెడ్‌ పోస్టుల ద్వారా ఎంతమంది వస్తున్నారో… ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఎటువంటి ఇబ్బందులు వస్తాయో సమగ్రంగా చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్‌ కమిషనరు వి.రామకృష్ణ, యూనియన్‌ ప్రతినిధులు కె.శ్రీనివాస్‌ యాదవ్‌, బిజె గాంధీ, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.
ధర్నా తాత్కాలిక వాయిదా : కాంట్రాక్టు లెక్చరర్స్‌ అసోసియేషన్‌
తమ సమస్యలపై మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చిన నేపథ్యంలో మంగళవారం తలపెట్టిన ధర్నాను తాత్కాలికంగా వాయిదావేస్తున్నట్లు ఎపి ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి బిజె గాంధీ వెల్లడించారు. కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీస్‌ క్రమబద్ధీకరిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీని తప్పకుండా అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. ఎయిడెడ్‌ కళాశాలల లెక్చరర్ల సర్దుబాటు వల్ల ఏ ఒక్క కాంట్రాక్టు లెక్చరర్‌ ఉద్యోగం కోల్పోరని తెలిపినట్లు వివరించారు. మంత్రి మరోసారి తమతో చర్చలు నిర్వహించి తుది నిర్ణయం ప్రకటిస్తారని పేర్కొన్నారు.

Immediate decision on employee safety
Adimulapu suresh
RELATED ARTICLES

కాంట్రాక్టు ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు లైన్ క్లియ‌ర్‌

తెలంగాణ రాష్ట్రం లో ఉన్న వివిధ శాఖ లల్లో ప‌ని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు శుభ వార్త. వారిని క్ర‌మ‌బ‌ద్దీక‌రించ డానికి లైన్ క్లీయ‌ర్...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...