Friday, April 19, 2024
Home ఆంధ్ర ప్రదేశ్ కోవిడ్‌తో చనిపోయిన కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.

కోవిడ్‌తో చనిపోయిన కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.

కోవిడ్‌తో చనిపోయిన కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా, కోవిడ్‌సోకిన వారికి 20రోజలు ప్రత్యేక సెలవలు, మహిళలకు 5రోజుల ప్రత్యేక సెలవలు మంజూరు చేయమని కోరుతూ… సచివాలయంలో పిడిఎఫ్‌ ఎంఎల్‌సీలు కె.ఎస్‌లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు, సాబ్జీషేక్‌ గార్లతో కలిసి ఎపి స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు ఎ.వి.నాగేశ్వరరావు, కార్యదర్శి కె.విజయ్‌లు ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌.ఎస్‌రావత్‌గారికి వినతిపత్రం అందించారు.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు అనేక సం॥లుగా సేవలందిస్తున్నారు. కోవిడ్‌ కాలంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా ప్రజలకు సేవలందించే క్రమంలో కోవిడ్‌ బారిన పడ్డారు. దాదాపు 100 మంది మరణించారు. కోవిడ్‌ బారిన పడిన వారికి ప్రత్యేక సెలవలు గత ఏడాది కాలంలో అమలు చేయలేదు. వచ్చే అరకొర జీతాలలో లాస్‌ఆఫ్‌ పే చేశారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌ తరువాత 50 లక్షల భీమా వర్తింపచేయటంలేదు. దీని వలన కోవిడ్‌ సోకిన వారికి తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదురౌతున్నాయి. కోవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
ఈ నేపద్యంలో వైద్య, ఆరోగ్యశాఖలోని రెగ్యులర్‌ ఉద్యోగులకు మాత్రమే అదీ కెటగిరీని బట్టి ఎక్స్‌గ్రేషియాను నిర్ణయిస్తూ జి.ఓ 299ని వైద్య, ఆరోగ్యశాఖ జారీ చేసింది.20రోజుల ప్రత్యేక సెలవలను మంజూరు చేస్తూ జి.ఓ ఎం.ఎస్‌ 45ను ఆర్ధికశాఖ నిన్ననే జి.ఓ జారీ చేసింది. అయితే ఈ జి.ఓలో గవర్నమెంట్‌ సర్వెంట్లకు వర్తిస్తుందని తెలియజేశారు. ఈ జి.ఓ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా వర్తింపచేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వలేదు.

RELATED ARTICLES

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...