Thursday, August 18, 2022
Home ఆంధ్ర ప్రదేశ్ మునిగిపోతున్న కార్పొరేషన్లు ..  33 సంస్థల్లో రూ.2 లక్షల కోట్ల రుణం

మునిగిపోతున్న కార్పొరేషన్లు ..  33 సంస్థల్లో రూ.2 లక్షల కోట్ల రుణం

పౌరసరఫరాలు, టిడ్కోల్లోనే అధికం

Employees Voice : ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్థికంగా మునిగిపోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ అవసరాల కోసం చేస్తున్న అప్పులు సంపదసృష్టికి అక్కరకు రావడం లేదని ఆయా సంస్థల అధికారులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై దృష్టి సారించిన అకౌంటెంటు జనరల్‌ కార్యాలయం కూడా నాలుగు రోజుల క్రితం రాష్ట్ర ఆర్థికశాఖకు ఒక లేఖ రాసింది. బడ్జెట్‌ ప్రతిపాదనల్లో లేకుండా తీసుకుంటున్న ఇటువంటి రుణాల వివరాలు సమర్పించాలని నిర్దేశించింది. ప్రభుత్వ రంగ సంస్థలైన అనేక కార్పొరేషన్లు ఇటీవల కాలంలో భారీగా రుణాలు తీసుకుంటు న్నాయి. దాదాపు 33 సంస్థలు రెండు లక్షల కోట్లకుపైగా రుణాలు తీసుకున్నట్లు సమాచారం. ఇందులో సింహభాగం ప్రభుత్వ అవసరాలకు పిడి ఖాతాల ద్వారా మళ్లిపోతున్నట్లు కనిపిస్తోంది. మొత్తం ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌ కింద 33 సంస్థలు రూ.2.14 లక్షల కోట్ల వరకు రుణాలు సేకరించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో అత్యధికంగా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ రూ.35 వేల కోట్ల వరకు రుణాలు తీసుకున్నట్లు తేలింది. ఇంధన శాఖకు సంబంధించి పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రూ.14 వేల కోట్లు, పవర్‌ కో-ఆర్డినేషన్‌ సంస్థ ద్వారా డిస్కామ్‌లు రూ.11 వేల కోట్లు, జెన్‌కో రూ.5 వేల కోట్లు, పవర్‌ డెవలప్‌మెరటు కార్పొరేషన్‌ రూ.వెయ్యి కోట్లు రుణంగా తీసుకున్నట్లు సమాచారం. ఇక ఇళ్ల నిర్మాణానికి సంబంధించి టిడ్కో రూ.12 వేల కోట్లు, గృహ నిర్మాణ సంస్థ రూ.4 వేల కోట్లు రుణంగా సమీకరించుకున్నట్లు తెలిసింది. రహదారుల అభివృద్ధి సంస్థ, నీటివనరుల అభివృద్ధి సంస్థ, ఆర్‌టిసి కూడా ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌ తీసుకున్న జాబితాలో ఉన్నాయి. కొత్తగా ఏర్పాటుచేసిన రాష్ట్రాభివృద్ధి సంస్థ రూ.23 వేల కోట్లు, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ రూ.10 వేల కోట్లు తీసుకోగా, గ్యారెంటీలు లేకుండా మరికొన్ని సంస్థలు రూ.65 వేల కోట్ల వరకు రుణాలు తీసుకున్నట్లు సమాచారం. మొత్తం రుణంలో కొన్ని సంస్థలు తామే రుణం తీసుకుని, తామే చెల్లించుకుంటున్నది రూ.50 వేల కోట్ల వరకు ఉంటుందని, దీంతో ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌ మొత్తం 1.64 లక్షల కోట్లకు చేరుకున్నట్లుగా ఉందని తెలిసింది. ఇంత భారీ రుణాలపై ఏటా రూ.15 వేల కోట్ల నుంచి రూ.17 వేల కోట్ల వరకు అసలుకు వాయిదాలు, వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని తెలుస్తోంది. ఇది రానున్న రోజుల్లో పెను భారంగానే మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రకంపనలు సృష్టిస్తోన్న ఎజి కార్యాలయ లేఖ
ఎజి కార్యాలయం రాసిన లేఖ ఆర్థికశాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి వ్యయం అంతా నిర్ధిష్ట రుణ పరిమితికి లోబడే ఉండాలని పేర్కొంది. అనుమతి లేకుండా చేసే రుణాలు ప్రభుత్వ రుణాలుగానే పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్లు తెలిసింది. అందుకే అనేక కోణాల్లో వివరాలు కూడా కోరింది. ఏ ప్రభుత్వ రంగ సంస్థ ఎంత రుణం తీసుకుంది, అందులో ప్రభుత్వ గ్యారెంటీతో తీసుకున్న రుణం ఎంత అన్న వివరాలతోపాటు, రుణమిచ్చిన ఆర్థిక సంస్థ, అందుకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల వివరాలు కూడా సమర్పించాలని కోరింది.

RELATED ARTICLES

వైద్య ఆరోగ్య శాఖ‌లో సిబ్బంది కుదింపు వ‌ద్దు

వైద్య ఆరోగ్యశాఖలో రేషనలైజేషన్‌ పేరుతో ప్రతి పిహెచ్‌సి లో 12 మంది సిబ్బందియుండేలా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఓ 143ను సవరించాలని, ప్రస్తుతం...

1న సీఎం ఇల్లు ముట్టడికి సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నిర్ణయం

2 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు పాల్గొనాలని పిలుపు93 వేల మంది సచివాలయాల ఉద్యోగులూ రావాలని విజ్ఞప్తిభవిష్యత్తు అంధకారం కాకుండా చూసుకోవాలని సూచనహామీపై జగన్‌ మడమ తిప్పేశారని...

అంగన్వాడీ సెంటర్‌ నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వండి

ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ఎంప్లాయీస్ వాయిస్ః అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. గురువారం ఈ మేరకు సంఘ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular