Thursday, August 18, 2022
Home ఆంధ్ర ప్రదేశ్ సగాని కన్నా తక్కువే..! - సచివాలయ పరీక్షల్లో 56,758 మందే పాస్‌

సగాని కన్నా తక్కువే..! – సచివాలయ పరీక్షల్లో 56,758 మందే పాస్‌

61,196 మంది ఫెయిల్‌
ఉద్యోగసంఘాల సమావేశంలో ప్రభుత్వం
పిఆర్‌సి హామీలపై ఎనిమిది జిఓలు విడుదల
బకాయిలన్నీ రిటైర్మెంట్‌ తరువాతే
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ కోసం నిర్వహించిన పరీక్షల్లో సగాని కన్నా తక్కువ మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 1.17,954 మంది పరీక్షలకు హాజరుకాగా 56,758 మంది మాత్రమే పాస్‌ అయ్యారు. మిగిలిన 61,196 మంది ఫెయిల్‌ అయ్యారు. వీరంతా వేరువేరు కారణాలతో పరీక్ష తప్పినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగ సంఘాల నాయకులతో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించింది. ఈ సమావేశంలో ఎపిజెఎసి నుండి బండి శ్రీనివాసరావు, శివారెడ్డి, ఎపిజెఎసి అమరావతి నుండి బప్పరాజు వెంకటేశ్వర్లు, వై.వి.రావు, ప్రభుత్వ ఉద్యోగ సంఘం నుండి కె.ఆర్‌.సూర్యనారాయణ, ఆస్కార్‌రావు, సెక్రటేరియట్‌ ఉద్యోగుల సంఘం నుండి వెంకట్రామిరెడ్డి, ప్రసాదు,ప్రభుత్వం తరపున ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌, శశిభూషణ్‌కుమార్‌, అరుణ్‌కుమార్‌, చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గన్నారు. ఈ సందర్భంగా పిఆర్‌సి చర్చల్లో ఇచ్చిన హామీల అమలు దిశలో ఎనిమిది జిఓలను ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్‌టిసి ఉద్యోగులను పిఆర్‌సిలో చేర్చడం, అలవెన్సులపై రెండు వేర్వేరు జిఓలు జారీచేశారు. సర్వీసులో ఉన్నవారికి, రిటైరైన ఉద్యోగులు మృతి చెందితే మట్టి ఖర్చులపై వేర్వేరు జిఓలు జారీచేశారు. పిఆర్‌సి, డిఏ బకాయిలు రిటైర్మెంట్‌ తరువాతే ఇస్తామని, ఈలోపు ఇవ్వడం సాధ్యం కాదని మరో జిఓ ఇవ్వగా ఉద్యోగ సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పిఆర్‌సి ఐదేళ్లకోసారి నియమిస్తామన్న జిఓను విడుదల చేశారు. గురుకులాలు, యూనివర్శిటీలు, పబ్లిక్‌ సెక్టార్‌ ఉద్యోగులకు పిఆర్‌సి అమలు చేస్తూ మరో జిఓ ఇచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రొబేషన్‌ను జూన్‌ 30 నాటికి పూర్తి చేస్తామని సిఎం హామీనిచ్చారని, ఇంతవరకు దానిపై ఎటువంటి కార్యచరణా లేదని ఎపి ఎన్‌జిఓ సంఘ నాయకులు బండి శ్రీనివాసరావు ప్రశ్నించారు. గ్రామ, వార్డు సచివాలయాల సెక్రటరీలకు ఎగ్జామ్స్‌ అనేది లేదని, ప్రభుత్వ అధికారులు కఠినమైన అంశాలపై పరీక్షలు నిర్వహించి వారిని పాస్‌ కాకుండా చూశారని, ఇది సరైంది కాదని తెలిపారు. దీనివల్ల ముఖ్యమంత్రి హామీనెరవేరదని వెల్లడించారు. లేని ఎగ్జామ్స్‌ నిబంధన పెట్టి వేధించడం సరికాదని ఎపిజెఎసి అమరావతి ఛైర్మన్‌ బప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. మిగిలిన 61 వేలమందిని కూడా వెంటనే పాస్‌ చేయించాలని కోరారు చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకానికి అర్హులైనవారు 1500 మంది వరకూ ఉన్నారని, వారికి పోస్టింగులు ఇవ్వలేదని వెంటనే ఇవ్వాలని కోరారు. జూన్‌ నాటికి పూర్తి చేస్తామన్నారని చేయలేదని వివరించారు. నాన్‌ ఫైనాన్షియల్‌ సమస్యలు 71 అంశాలపై ఇచ్చిన వినతిపై ఇంతవరకు స్పందనలేదని వెంటనే పరిష్కరించాలని కోరారు. అలాగే వైద్యఆరోగ్య ఇతర రంగాల్లో ఉద్యోగులు, సిబ్బంది సమస్యలపై ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అరియర్స్‌ రిటర్మైంట్‌ తరువాత ఇస్తామనడం సరికాదని వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఒకటో తేదీనే పెన్షన్‌ వచ్చేలా చూడాలని కోరారు.. కొత్త జిల్లాల హెడ్‌ క్వార్టర్లలోనూ హెచ్‌ఆర్‌ఏ 16 శాతం అమలు చేయాలని కోరారు. దీనిపై అధికారులు తటపటాయించారు. స్పష్టమైన హామీనివ్వలేదు. రెవెన్యూలో డిప్యూటీ తహశీల్దార్లు, విఆర్‌ఓల క్యాడర్‌ పెంచారని, వారికి పెరిగిన పేస్కేళ్లు అమలు చేయాలని కోరారు. పోలీసుల సరెండర్‌ లీవు బకాయిలు కూడా చెల్లించడం లేదని వెంటనే చెల్లించాలన్నారు. గురుకులాలు యూనివర్శిటీ, పబ్లిక్‌ సెక్టార్‌ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు 60 సంవత్సరాలకే పరిమితం చేశారని, వారికీ 62 సంవత్సరాలు వర్తింపజేయాలని కోరారు. దీనిపై స్పందించిన రావత్‌ కేంద్రం నుండి నిధులు రావాల్సి ఉందని, వచ్చిన వెంటనే వారిని సర్దుతామని తెలిపారు. సెక్రటేరియట్‌ ఉద్యోగుల సంఘం నాయకులు వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు సూర్యనారాయణ మాట్లాడుతూ నాన్‌ ఫైనాన్షియల్‌ అంశాలను వెంటనే పరిష్కరించాలని కోరారు.

ఉపాధ్యాయ సంఘాలను పిలవకపోవడంపై ఆగ్రహం
ఉపాధ్యాయ సంఘాలను, ఇతర సంఘాలను పిలవకపోవడంతో ఎపి ఎన్‌జిఓ ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు, నాయకులు శివారెడ్డి తదితరులు ప్రశిుంచారు. పిఆర్‌సి ఒప్పందం మేరకు నాలుగు సంఘాలనే పిలిచామని రావత్‌ తెలిపారు. ఇది సరైంది కాదని, అనిు సంఘాలను పిలిచి ఉండాల్సిందని ఉద్యోగ సంఘాల నాయకులు సూచించారు.

RELATED ARTICLES

వైద్య ఆరోగ్య శాఖ‌లో సిబ్బంది కుదింపు వ‌ద్దు

వైద్య ఆరోగ్యశాఖలో రేషనలైజేషన్‌ పేరుతో ప్రతి పిహెచ్‌సి లో 12 మంది సిబ్బందియుండేలా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఓ 143ను సవరించాలని, ప్రస్తుతం...

1న సీఎం ఇల్లు ముట్టడికి సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నిర్ణయం

2 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు పాల్గొనాలని పిలుపు93 వేల మంది సచివాలయాల ఉద్యోగులూ రావాలని విజ్ఞప్తిభవిష్యత్తు అంధకారం కాకుండా చూసుకోవాలని సూచనహామీపై జగన్‌ మడమ తిప్పేశారని...

అంగన్వాడీ సెంటర్‌ నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వండి

ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ఎంప్లాయీస్ వాయిస్ః అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. గురువారం ఈ మేరకు సంఘ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

వైద్య ఆరోగ్య శాఖ‌లో సిబ్బంది కుదింపు వ‌ద్దు

వైద్య ఆరోగ్యశాఖలో రేషనలైజేషన్‌ పేరుతో ప్రతి పిహెచ్‌సి లో 12 మంది సిబ్బందియుండేలా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఓ 143ను సవరించాలని, ప్రస్తుతం...

1న సీఎం ఇల్లు ముట్టడికి సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నిర్ణయం

2 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు పాల్గొనాలని పిలుపు93 వేల మంది సచివాలయాల ఉద్యోగులూ రావాలని విజ్ఞప్తిభవిష్యత్తు అంధకారం కాకుండా చూసుకోవాలని సూచనహామీపై జగన్‌ మడమ తిప్పేశారని...

అంగన్వాడీ సెంటర్‌ నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వండి

ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ఎంప్లాయీస్ వాయిస్ః అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. గురువారం ఈ మేరకు సంఘ...