Thursday, August 18, 2022
Home ఆంధ్ర ప్రదేశ్ పత్తా లేని పిఆర్సీ జీవోలు

పత్తా లేని పిఆర్సీ జీవోలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్య‌మంత్రి వై.ఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి
     12వ పిఆర్సీకి టైము దగ్గర పడింది. కాని 11వ పిఆర్సీకి సంబంధించిన హామీలకే దిక్కు లేని పరిస్థితి. అసలు వేతన సవరణ మంత్రుల కమిటీ హామీ మేరకు అయిదేళ్లకా….? లేక మొదట చేసిన ప్రకటన ప్రకారం పదేళ్లకా…? ఐదేళ్ల పిఆర్సీ హామీకి జీఓ ఇవ్వక పోవడానికి కారణం ఏమిటి…? 

రికవరీల రద్దు జీఓకు మోక్షం లభించలేదు ఎందుకని.. ? సిపిఎస్ అంశాన్ని జటిలం చేసే యత్నాల వెనుక దాగివున్న ఎత్తుగడల ఆంతర్యం ఏమిటి…? కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ అంశం మరుగున పడిపోవడం వెనుక మర్మం ఏమిటి…? ఇవన్నీ ఉద్యోగులు ఉపాధ్యాయులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న ప్రశ్నలు.

  పిఆర్సీ పై జనవరి 17న ప్రభుత్వం ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చింది. వాటికి వ్యతిరేకంగా ఉద్యోగ ఉపాధ్యాయులు ఉద్యమించారు. చలో విజయవాడ నిర్వహించి ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం బింకం వీడి దిగివచ్చింది. ఉభయులు మద్య చర్చలు జరిగాయి. ఫిబ్రవరి 5న ఒప్పందం కుదిరింది. అనంతరం ఫిబ్రవరి 20న కొన్ని అంశాలపై ఉత్తర్వులు విడుదల చేసింది. మిగిలిన అంశాలపై నేటి వరకు ఎటువంటి జీఓలు విడుదల చేయలేదు. 

అన్ని రకాల రికవరీలను నిలిపివేస్తామని మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది. కానీ ఉత్తర్వులు మాత్రం ఇవ్వలేదు.ఫలితంగా రికవరీల కత్తి ఉద్యోగుల పై వేలాడుతూనే వుంది. గురుకులాలు ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు పిఆర్సీ అమలుకు జారీ కావలసిన ప్రత్యేక జీఓలకు అతీ గతీ లేకుండా పోయింది. ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ పై ఉత్తర్వులు సైతం ఇంతవరకు జారీ కాలేదు. ఇక పై కేంద్రం అమలు చేస్తున్న వేతన సవరణను రాష్ట్రంలో కూడా పదేళ్లకు ఒకసారి అమలు చేస్తామని అధికారుల కమిటీ ప్రకటించగా మంత్రుల కమిటీ మాత్రం ఎప్పటిలాగే అయిదేళ్లకు ఒకసారి అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఆ జిఓ కూడా పత్తా లేకుండా పడి ఉంది.

     సిపిఎస్ రద్దు పై మార్చి 30 లోపు రోడ్ మ్యాప్ ప్రకటిస్తామని మంత్రుల కమిటీ ప్రకటించింది. కానీ దీనికి విరుద్ధంగా ఏప్రిల్ 25న జీపిఎస్ ( గ్యారంటీ పెన్షన్ స్కీమ్) ను తెర పైకి తెచ్చింది. కానీ జీపిఎస్ కు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ససేమిరా అంటున్నాయి. అదేవిధంగా జిపిఎఫ్, ఎపిజిఎల్ఐ రుణాలు క్లైములు తదితరాలకు సంబంధించిన 2100 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.వీటన్నింటినీ ఏప్రిల్ నాటికి క్లియర్ చేస్తామని హామీ ఇచ్చినా నేటికీ అమలు కాలేదు. మొత్తం మీద మెజారిటీ పిఆర్సీ హామీలన్నీ పెండింగ్ లో వుండటం గమనార్హం. వీటి అమలు కోసం మరో సారి ఉద్యోగ ఉపాధ్యాయులు ఐక్య పోరాటానికి సిద్ధం కావడం ఒక్కటే పరిష్కారం. ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే ఉద్యమ పథంలో వున్నాయి. ఉద్యోగుల్ని కూడా కలసి రమ్మని కోరుతున్నాయి. ఎటువంటి శషబిషలకు తావు లేకుండా ఐక్య పోరాటానికి సిద్ధం కావడమే ఉద్యోగుల ముందున్న ఏకైక కర్తవ్యం. 
RELATED ARTICLES

వైద్య ఆరోగ్య శాఖ‌లో సిబ్బంది కుదింపు వ‌ద్దు

వైద్య ఆరోగ్యశాఖలో రేషనలైజేషన్‌ పేరుతో ప్రతి పిహెచ్‌సి లో 12 మంది సిబ్బందియుండేలా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఓ 143ను సవరించాలని, ప్రస్తుతం...

1న సీఎం ఇల్లు ముట్టడికి సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నిర్ణయం

2 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు పాల్గొనాలని పిలుపు93 వేల మంది సచివాలయాల ఉద్యోగులూ రావాలని విజ్ఞప్తిభవిష్యత్తు అంధకారం కాకుండా చూసుకోవాలని సూచనహామీపై జగన్‌ మడమ తిప్పేశారని...

అంగన్వాడీ సెంటర్‌ నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వండి

ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ఎంప్లాయీస్ వాయిస్ః అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. గురువారం ఈ మేరకు సంఘ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular