Thursday, August 18, 2022
Home కేంద్ర ప్ర‌భుత్వ, ప్ర‌భుత్వ రంగ సంస్ధ‌లు ఉద్యోగుల వేతన సవరణకు… ఇక కొత్త పే కమిషన్ ఉండబోదా ?

ఉద్యోగుల వేతన సవరణకు… ఇక కొత్త పే కమిషన్ ఉండబోదా ?

ఉద్యోగుల వేతన సవరణకు… 
ఇక కొత్త పే కమిషన్ ఉండబోదా ?

కేంద్రం… కొత్త ఫార్ములాతో రాబోతోంది

ఏడవ పే కమిషన్ తర్వాత… వేతన స్థిరీకరణ ఎలా ఉండనుంది ?

ఉద్యోగుల వేతన స్థిరీకరణకు సంబంధించి ఏడవ పే కమిషన్ తర్వాత కొత్త పే కమీషన్ ఏర్పాటు కాదా ? ఈ ప్రశ్నకు ‘అవును’ అన్న సమాధానమే వినవస్తోంది. ఇందుకు కారణం… ఉద్యోగుల వేతనాలను  నిర్ణయించడంలో కేంద్ర ప్రభుత్వం కొత్త ఫార్ములాతో రావచ్చునని తెలుస్తుండడమే. కొత్త వేతనాలు పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇంక్రిమెంట్ ఆధారంగా ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అయితే వేతనం  లెక్కింపులో అసెస్‌మెంట్‌కు సంబంధించిన విధివిధానాలు ఇంకా స్పష్టంగా లేని నేపథ్యంలో… కేంద్రం ఈ దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కరువుభత్యం(డీఏ) 50 శాతం దాటిన తర్వాత వేతనాన్ని ఆటోమేటిక్‌గా లెక్కించే ఫార్ములాపై ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా వినవస్తోంది . మొత్తంమీద కొత్త గణన ‘ఆటోమేటిక్ పే రివిజన్(ఏపీఆర్)’ పేరుతో రూపుదిద్దుకోవచ్చని ప్రభుత్వవర్గాల నుంచి వినవస్తోంది. ఈ క్రమానికి సంబంధించి మరిన్ని వివరాలిలా ఉన్నాయి.
యూపీఏ ప్రభుత్వ హయాంలో 2014 లో 7 వ వేతన సంఘం ఏర్పాటైన విషయం తెలిసిందే. జస్టిస్ అశోక్ కుమార్ మాథుర్ అధ్యక్షతన, పే కమిషన్‌లో వివేక్ రాయ్(అప్పటి సెక్రటరీ, పెట్రోలియం & నేచురల్ గ్యాస్), పార్ట్ టైమ్ మెంబర్‌గా రథిన్ రాయ్(అప్పటి డైరెక్టర్, ఎన్‌ఐపీఎఫ్‌పీ),  మీనా అగర్వాల్(అప్పటి ఓఎస్‌డీ, వ్యయ విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖ) కార్యదర్శిగా పే కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్… పద్ధెనిమిది నెలల వ్యవధితో ఈ ఏర్పాటు జరిగింది.
ఇదిలా ఉంటే… ప్రస్తుత వేతన సవరణ సంఘం కాలపరిమితి పూర్తైన తర్వాత… ఇక కొత్తగా వేతన స్థిరీకరణ సంఘాల ఏర్పాటు జరగబోదంటూ వినవస్తోంది. కరువుభతం ఒక పరిమితి దాటిన తర్వాత… ధాని అనుసంధానంగా లెక్కించే అంశాలు, హూలువేతనం(బేసిక్ పే) ప్రాతిపదికన ఆటోమేటిక్‌గా లెక్కిస్తారని, ఈ క్రమంలో ప్రత్యేకంగా ఓ ఫార్ములా రూపుదిద్దుకుంటోందని కేంద్ర ఆర్ధికశాఖ వర్గాల నుంచి వినవస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే… కేంద్ర ఉద్యోగులు… ప్రతీ ఐదేళ్ళకోమారు తమకు జరగనున్న వేతన స్థిరీకరణలకు సంబంధించి ఎదురుచూపులు చూడాల్సిన అవసరం ఇకపై ఉండకపోవచ్చు. ఎందుకంటే… ఈ ఫార్ములా ప్రకారం… ఆటోమేటిక్‌గానే వేతన స్థిరీకరణ జరిగిపోతుంటుంది

RELATED ARTICLES

అంగన్వాడీ సిబ్బంది గ్రాట్యుటీకి అర్హులే

అంగన్వాడీ సిబ్బంది గ్రాట్యుటీకి అర్హులే వారికి కనీస సామాజిక భద్రత అవసరం: సుప్రీం కోర్టు అంగన్వాడీ...

‘ఉపా’ చట్టంతో ధ్వంసమవుతున్న జీవితాలు

అనేక సంవత్సరాలుగా శిక్షా స్మృతిని సంస్కరించాల్సిన అవసరం ఉంది. కానీ, సమీప భవిష్యత్తులోనైనా కనీసం 'ఉపా' చట్టం మానవ జీవితాలను ధ్వంసం చేస్తున్న తీరును కట్టడి చేయాల్సిన అవసరముంది. బెయిల్‌...

ఈపీఎఫ్‌ వడ్డీరేటు భారీగా కోత

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడగానే కేంద్రం ‘షాకులు’ ఇవ్వడం మొదలుపెట్టింది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) వడ్డీ రేటును 0.4 శాతం...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

వైద్య ఆరోగ్య శాఖ‌లో సిబ్బంది కుదింపు వ‌ద్దు

వైద్య ఆరోగ్యశాఖలో రేషనలైజేషన్‌ పేరుతో ప్రతి పిహెచ్‌సి లో 12 మంది సిబ్బందియుండేలా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఓ 143ను సవరించాలని, ప్రస్తుతం...

1న సీఎం ఇల్లు ముట్టడికి సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నిర్ణయం

2 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు పాల్గొనాలని పిలుపు93 వేల మంది సచివాలయాల ఉద్యోగులూ రావాలని విజ్ఞప్తిభవిష్యత్తు అంధకారం కాకుండా చూసుకోవాలని సూచనహామీపై జగన్‌ మడమ తిప్పేశారని...

అంగన్వాడీ సెంటర్‌ నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వండి

ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ఎంప్లాయీస్ వాయిస్ః అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. గురువారం ఈ మేరకు సంఘ...