Thursday, August 18, 2022
Home ఆంధ్ర ప్రదేశ్ రోజుకు మూడుసార్లు ఎస్సార్!

రోజుకు మూడుసార్లు ఎస్సార్!

• గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు కొత్త హాజరు నిబంధన

• ఏ శాఖల్లోనూ లేని కొత్త విధానం నేటి నుంచి అమలు

ప్రొబేషన్ ఖరారులో ఇప్పటికే జాప్యంతో అవ స్థలు పడుతున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు మరో కొత్త సమస్యను ఎదుర్కోబోతున్నారు. ఏ ఇతర ప్రభుత్వశాఖ లోనూ లేనివిధంగా రోజులో మూడుసార్లు హాజరు తప్పనిసరి చేసే కొత్త విధానం సచివా లయాల్లో శనివారం నుంచి అమలులోకి

రానుంది. గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ఇందుకోసం ప్రత్యేక యాప్ తీసుకొచ్చింది. దీన్ని ఉద్యోగులు తమ స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకొని శనివారం నుంచి మూడుసార్లు హాజరు వేసుకోవాలి. ఉదయం 10 గంటల్లోపు, మధ్యాహ్నం 3కు, సాయంత్రం 5 గంటలకు హాజరు తప్పనిసరి. సొంత ఫోన్లు లేనివారు ‘సచివాలయాలకు ప్రభుత్వం కేటాయించిన స్మార్ట్ ఫోన్లు ఉపయోగించుకోవాలి. ఈ ఆదేశా లతో ఉద్యోగుల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవు తోంది. 2019 అక్టోబరులో విధుల్లో చేరిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబే షన్ 2021 అక్టోబరులో ఖరారు చేయాలి. శాఖా పరమైన పరీక్షల్లో చాలామంది ఉత్తీర్ణులు కాలే దన్న ఉద్దేశంతో 2022 జూన్లో అందరి ప్రొబే షన్ ఒకేసారి ఖరారు చేయాలని అధికారులను సీఎం కొద్ది నెలల క్రితం ఆదేశించారు. ఏప్రిల్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన శాఖాపరమైన పరీక్షల్లో చాలామంది. ఉద్యోగులు ఉత్తీర్ణులు కాలేదు.. దీంతో ప్రొబేషన్పై నీలినీడలు అలముకొని వారు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మూడు పూటలా బయోమెట్రిక్ తప్పనిసరి చేయడంతో వీరంతా ఆవేదన చెందు తున్నారు. ఈ విధానం అమలుకు సంబంధించి ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలశాఖ మార్గదర్శకాలు చేసింది. శనివారం నుంచి అమలు కోసం రెండు రోజుల క్రితం యాప్ని విడుదల చేసి ఉద్యోగుల స్మార్ట్ ఫోన్లులో డౌన్లోడ్ చేసుకోవాలని ఉన్నతా ధికారులు ఆదేశించారు.

‘స్పందన’కు హాజరు తప్పనిసరి చేస్తున్నాం: అధికారులు

మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 వరకు ప్రతి రోజూ సరివాలయాల్లో నిర్వహించే స్పందన కార్య క్రమానికి ఉద్యోగులంతా విధిగా హాజరవ్వాలన్న ఉద్దేశంతో మూడు పూటలా హాజరు తప్పనిసరి చేశామని అధికారులు చెబుతున్నారు. ‘చాలా మంది ఉదయం హాజరు వేసుకొని క్షేత్రస్థాయి పర్యటనల పేరుతో సాయంత్రం వరకు బయట ఉండి సాయంత్రం 5 గంటలకు వచ్చి మళ్లీ రెండో సారి హాజరు వేస్తున్నారు. ఈ కారణంగా స్పందన’లో ప్రజలు =5 వినతులకు సమాధానం చెప్పేవారు ఉండడం లేదు. ఈ రెండు గంటలూ ఉద్యోగులంతా విధిగా సచివాలయాల్లో ఉండాలనే ఉద్దేశంతో మూడు పూటలా హాజరు పెట్టాం’ అని సచివాలయశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఒత్తిడి పెంచడమే: ఉద్యోగులు

ఏ ఇతర ప్రభుత్వశాఖల్లోనూ అమలు చేయని విధానాన్ని కేవలం సచివాలయాల్లో ప్రవేశ పెట్టడం ఉద్యోగులను ఒత్తిడికి గురి చేయడమేనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రొటేషన్ ఖరారులో జాప్యం వల్ల అరకొర వేతనాలతో తీవ్ర అవస్థలు పడుతున్నాం. ఈ సమస్యలో పరిష్కారం చూపకపోగా.. మూడుసార్లు హాజరు తప్పనిసరి. చేయడం వేధింపులకు గురి చేయడమే’ అని ఉద్యో గుల సంఘం నాయకుడొకరు వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

వైద్య ఆరోగ్య శాఖ‌లో సిబ్బంది కుదింపు వ‌ద్దు

వైద్య ఆరోగ్యశాఖలో రేషనలైజేషన్‌ పేరుతో ప్రతి పిహెచ్‌సి లో 12 మంది సిబ్బందియుండేలా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఓ 143ను సవరించాలని, ప్రస్తుతం...

1న సీఎం ఇల్లు ముట్టడికి సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నిర్ణయం

2 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు పాల్గొనాలని పిలుపు93 వేల మంది సచివాలయాల ఉద్యోగులూ రావాలని విజ్ఞప్తిభవిష్యత్తు అంధకారం కాకుండా చూసుకోవాలని సూచనహామీపై జగన్‌ మడమ తిప్పేశారని...

అంగన్వాడీ సెంటర్‌ నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వండి

ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ఎంప్లాయీస్ వాయిస్ః అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. గురువారం ఈ మేరకు సంఘ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular