Thursday, August 18, 2022
Home ఆంధ్ర ప్రదేశ్ ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు

ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు

డీజిల్‌ ధరలు పెరగడంతో ఆర్టీసీపై భారం పడిందని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డీజిల్‌ బల్క్‌ రేటు విపరీతంగా  పెరిగిందని పేర్కొన్నారు. నిర్వహణ ఖర్చు కూడా రాకపోతే పూర్తి నష్టాల్లోకి వెళుతుందని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో డిజీల్‌ సెస్‌ కింద పెంచాల్సి వస్తోందని పేర్కొన్నారు.

డీజిల్‌ సెస్‌ కింద పెంపు..
► పల్లెవెలుగు సర్వీసులపై రూ. 2 పెంపు.. 
►ఇకపై పల్లె వెలుగు బస్సుల్లో మినిమమ్‌ ఛార్జీ 10రూ. గానిర్ధారణ
►ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులపై  రూ. 5 పెంపు
►ఏసీ బస్సుల్లో రూ. 10 పెంపు

తప్పనిసరి పరిస్థితుల్లో పెంపుదల తప్పట్లేదన్న ఆయన.. ఇది ఛార్జీల పెంపు కాదని గుర్తించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. పెంచిన ధరలు రేపటి (ఏప్రిల్‌ 14) నుంచే అమలులోకి రానున్నాయి. ప్రయాణికులు అర్థం చేసుకొని సహకరిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. పల్లెవెలుగు కనీస ఛార్జీ ఇకపై రూ.10గా నిర్ణయించామని తెలిపారు. కరోనా వల్ల ఆర్టీసీ ఆదాయానికి గండి పడిందని పేర్కొన్నారు. ఆర్టీసీపై రోజుకు రూ.3.5 కోట్ల భారం పడుతోందని తెలిపారు. రెండేళ్లుగా ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదని పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే పెంపు నిర్ణయించామని తెలిపారు. డీజిల్‌ సెస్‌ మాత్రమే పెరుగుదల అని పేర్కొన్నారు. 

RELATED ARTICLES

వైద్య ఆరోగ్య శాఖ‌లో సిబ్బంది కుదింపు వ‌ద్దు

వైద్య ఆరోగ్యశాఖలో రేషనలైజేషన్‌ పేరుతో ప్రతి పిహెచ్‌సి లో 12 మంది సిబ్బందియుండేలా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఓ 143ను సవరించాలని, ప్రస్తుతం...

1న సీఎం ఇల్లు ముట్టడికి సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నిర్ణయం

2 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు పాల్గొనాలని పిలుపు93 వేల మంది సచివాలయాల ఉద్యోగులూ రావాలని విజ్ఞప్తిభవిష్యత్తు అంధకారం కాకుండా చూసుకోవాలని సూచనహామీపై జగన్‌ మడమ తిప్పేశారని...

అంగన్వాడీ సెంటర్‌ నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వండి

ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ఎంప్లాయీస్ వాయిస్ః అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. గురువారం ఈ మేరకు సంఘ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular