Friday, April 19, 2024
Home ఆంధ్ర ప్రదేశ్ సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలం
సంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదు
జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలి
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌ అసోసియేషన్‌ డిమాండ్‌
నేడు పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో సమావేశం
చర్చలకు రావాలని ఆహ్వానించిన ఆర్థికశాఖ
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌ అసోసియేషన్‌ ఆగ్రహం

రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల హక్కులు సాధించడంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలన్నీ విఫలమయ్యాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌ అసోసియేషన్‌ విమర్శించింది. అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు వినుకొండ రాజారావు, ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీనివాసరావు బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. గత రెండున్నరేళ్లుగా ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించామని ఉద్యోగ సంఘాలు ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉద్యోగుల ప్రయోజనాలను సాధించలేనప్పుడు జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో ఉండడం దేనికని ప్రశ్నించారు. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను తక్షణమే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వంతో ఏమైనా రహస్య ఒప్పందాలున్నాయా అని నిలదీశారు. సుమారు 13 లక్షల మంది ఉద్యోగుల హక్కులను సాధించే దిశగా గుర్తింపు ఉద్యోగ సంఘాలు పనిచేయడంలేదని విమర్శించారు.

రెండున్నర లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు, మూడున్నర లక్షల మంది ప్రైవేట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో స్థానం లేదని, అలాంటప్పుడు వారి సమస్యలపై ప్రశ్నించేది ఎవరని నిలదీశారు. ఏపీ ఎన్‌జీవో సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘంతో సహా రాష్ట్రంలో గుర్తింపు పొందిన సంఘాలన్నీ ఉద్యోగుల హక్కులు, సంక్షేమాన్ని విస్మరించాయన్నారు. పీఆర్‌సీ నివేదికను బహిర్గతం చేయడంతోపాటు జీఏడీలో నమోదైన మేరకు సంఘాలు నిర్వహిస్తున్నా రా? సభ్యత్వాల సంఖ్య ఎంత? అన్నది కూడా తేల్చాలని డిమాండ్‌ చేశారు. పీఆర్‌సీ అమలుతోపాటు కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్యకార్డులు పూర్తిగా అమలు, జీపీఎఫ్‌, ఏపీ జీఎ్‌సఐ, రిటైర్మెంట్‌ ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలన్నీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తమ సంఘం కేవలం ఉద్యోగుల సంక్షేమం, హక్కుల సాధన లక్ష్యంగానే ఏర్పాటైందని, అన్ని జిల్లాల్లో సంఘం శాఖలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సభ్యత్వాలు లేని సంఘాలను జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ నుంచి తప్పించాలని, ప్రభుత్వంతో చర్చలకు సీపీఎస్‌ ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

RELATED ARTICLES

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...

వెబ్‌సైట్‌లో జీవోలు ఎందుకు పెట్టట్లేదని ఏపీ హైకోర్టు సీరియస్

స‌చివాల‌యం ప్ర‌తినిధిః జీవోఐఆర్టీ వెబ్‌సైట్‌లో జీవోలు ఎందుకు పెట్టట్లేదని ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సాఫీగా జరిగిపోయే ప్రక్రియకు ఆటంకం కల్పించడంపై ధర్మాసనం సీరియస్ అయింది. వెబ్‌సైట్‌లో...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...