Thursday, March 28, 2024
Home ఆంధ్ర ప్రదేశ్ మీట‌ర్ రీడ‌ర్ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని విజ‌య‌వాడ‌లో నిర‌స‌న దీక్ష‌లు ప్రారంభం

మీట‌ర్ రీడ‌ర్ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని విజ‌య‌వాడ‌లో నిర‌స‌న దీక్ష‌లు ప్రారంభం

డిసెంబ‌ర్ 1 వ తేదిన ఛ‌లో విజ‌య‌వాడ‌

ఎస్‌.పి.డి.సి.ఎల్‌, ఈ.పి.డి.సి.ఎల్‌, సి.పి.డి.సి.ఎల్‌ పరిధిలో మీటర్‌ రీడర్స్‌ పనిదినాల కుదింపు నిర్ణయాన్ని
ఉపసంహరించుకోవాలని, ఎస్‌.పి.డి.సి.ఎల్‌. పరిధిలో 15 శాతం సర్వీసులు రీడిరగ్‌ డిపార్టుమెంట్‌ ఉద్యోగులతో చేయించాలనే ఉత్తర్వులను రద్దు చేయాలని, పీసురేటు రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్స్‌ సోమవారం విజయవాడ ధర్నా చౌక్‌ (అలంకార్‌ సెంటర్‌)లో మొదటి రోజు నిర్ణసన దీక్షలను యూనియన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం. బాలకాశి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం. బాలకాశి మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ.పి.డి.సి.ఎల్‌, సి.పి.డి.సి.ఎల్‌ మరియు ఎస్‌.పి.డి.సి.ఎల్‌ పరిధిలో 4,600 మంది మీటర్‌ రీడర్స్‌ గత 15 సంవత్సరాల పైబడి స్పాట్‌ బిల్లింగ్‌ పనిని నిర్వహిస్తున్నారు. జూన్‌ 2020న సి.పి.డి.సి.ఎల్‌ పరిధిలో అలాగే సెప్టెంబర్‌ 2020న ఎస్‌.పి.డి.సి.ఎల్‌ పరిధిలో ఉన్న స్పాట్‌ బిల్లింగ్‌ పని దినాలను కుదించటం జరిగింది. పని దినాలు కుదించటం వలన మీటర్‌ రీడర్స్‌కు వచ్చే వేతనాలు తగ్గిపోవడంతో పాటు పనిభారం పెరుగుతుందని పలు దఫాలుగా వినతిపత్రం అందజేసినా యాజమాన్యాలు పట్టించుకోలేదు. ప్రస్తుతం ఎస్‌.పి.డి.సి.ఎల్‌్‌, సి.పి.డి.సి.ఎల్‌ పరిధిలో మీటర్‌ రీడర్ల బిల్లింగ్‌ పని దినాలు తగ్గిపోవడం వలన ఆర్థిక ఇబ్బందులతో పాటు శారీరకంగా, మానసికంగా అనేక ఇబ్బందులకు లోనవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో డిపార్ట్‌మెంట్‌ వారు కూడా వినియోగదారులకు ఇంటికి వెళ్లడానికి బయపడుతున్న పరిస్థితుల్లో కూడా మీటర్‌ రీడర్స్‌ మాత్రం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బిల్లింగ్‌ పూర్తిచేసి యాజమాన్యాలకు ఆదాయం పెంపొందించడంలో కీలకపాత్ర పోషించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 మంది మీటర్‌ రీడర్లు కరోనా మహమ్మారితో మృతి చెందారు. అలాగే వందల మంది మీటర్‌ రీడర్స్‌ కరోనా బారినపడ్డారు. కనీసం మృతి చెందినటువంటి మీటర్‌ రీడర్ల కుటుంబాలకు యాజమాన్యాలు ఆర్థికంగా ఎటువంటి సహాయ సహకారాలు అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
నవంబర్‌ 2021 నుండి ఈపిడిసిఎల్‌ పరిధిలో స్పాట్‌ బిల్లింగ్‌ పనిదినాలను తగ్గిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎస్‌పిడిసిఎల్‌ పరిధిలో 15 శాతం రీడిరగ్‌ డిపార్టుమెంట్‌ సిబ్బందితో బిల్లింగ్‌ చేయించడానికి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేయడంతో మీటరు రీడర్లను పొమ్మనకుండా పొగబెట్టే విధంగా యాజమాన్యం వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రివర్యులు శ్రీ.వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్రలో మరియు మొట్ట మొదట అసెంబ్లీ సమావేశాల్లో మీటర్‌ రీడర్లకు ఉద్యోగభద్రత కల్పిస్తామని, దళారి వ్యవస్థను రద్దు చేసి రీడర్లకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ రంగ సంస్ధల కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ రాష్ట్ర కార్యదర్శి నూర్‌మహమ్మద్‌, అంగన్వాడీ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ సంఫీుభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివారెడ్డి, మూస, రమేష్‌, సుబ్రమణ్యం, దస్తిగిరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...