Friday, March 29, 2024
Home ఆంధ్ర ప్రదేశ్ ఆర్టీసి హౌస్ ముందు నిర‌స‌న‌

ఆర్టీసి హౌస్ ముందు నిర‌స‌న‌

ఆర్టీసిలో పెండింగ్‌లో ఉన్న కార‌ణ్య నియామ‌కాలు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేస్తూ శుక్ర‌వారం విజ‌య‌వాడ‌లోని ఆర్టీసి హౌస్ ముందు ధ‌ర్నా నిర్వ‌హించ‌డం జ‌రిగింది. వంద‌లాది మంది అభ్య‌ర్ధులు 2016 నుండి కుటుంబ పెద్ద‌ల‌ను కోల్పొయి ఎటువంటి ఉపాధి అవ‌కాశాలు లేక ఇబ్బందుటు ప‌డుతున్నారు. స‌మ‌స్య‌ను వెంట‌నే ప‌రిష్క‌రించి ఉద్యోగాలు ఇవ్వాల‌ని సిఐటియు రాష్ట్ర నాయ‌కులు నూర్ మ‌హమ్మ‌ద్ డిమాండ్ చేశారు.

అర్టీసి యాజ‌మాన్యం 1.1.2020 నుండి చ‌నిపోయిన కుటుంబ సభ్యుల‌కు మాత్ర‌మే కార‌ణ్య నియామ‌కాలు వ‌ర్తిస్ధాయి అని ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. గ‌త ఎన్నో సంవ‌త్స‌రాల నుండి ఎదురుచూస్త‌న్న వారిని ప‌ట్టించుకోకుండా నిర్ల‌క్ష్యం చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం, ఆర్టీసి యాజ‌మాన్యం చావులోనూ వివ‌క్ష‌త చూప‌కుండా 2016 సంవ‌త్స‌రం నుండి చ‌నిపోయిన వారికి కూడా ప్ర‌ధాన్య‌త‌గా గుర్తించి ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు.
గ‌తంలో 2019 సం మే నెల‌లో అభ్య‌ర్ధుల ఒరిజిన‌ల్‌ స‌ర్టిఫికేట్ వెరిఫికేష‌న్ నిమిత్తం తీసుకున్నారు. 2019 అక్టోబ‌ర్‌లో ఇంట‌ర్వూలు నిర్వ‌హించి, అంద‌రికీ ద‌శ‌ల వారిగా ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని అన్నారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి ఉద్యోగం ఇవ్వ‌కుండా కాల‌యాపన చేస్తూన్నారు. వారి కుటుంబాల‌కు వ‌చ్చే పిన్ష‌న్ కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం వృధ్ధుల‌కు ఇచ్చే మొత్తం క‌న్నా చాలా త‌క్కువ‌. కుటుంబ స‌భ్యులు ఎటువంటి ఉపాది అవ‌కాశాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వ‌చ్చిన అభ్య‌ర్ధులు ఆర్టీసి హౌస్ ముందు పెద్దఎత్తున్న మాకు న్యాయం చేయాల‌ని నినాదాలు చేశారు. అనంత‌రం విన‌తిపత్రాన్నీ ఎండి ద్వార‌క తిరుమ‌ల‌రావుకు స‌మ‌ర్పించారు. నెల రోజుల‌లోపు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని ఎండి హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో అభ్య‌ర్ధులు అన్న‌మ‌య్య‌, అంజినికుమార్‌, జిలానీ, సంతోష్‌, నాగ‌మ‌ణి, నందినితో పాటు 13 జిల్లాల నుండి అభ్య‌ర్ధులు హాజ‌ర‌య్యారు.

RELATED ARTICLES

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...