Friday, March 29, 2024
Home ఆంధ్ర ప్రదేశ్ యూనివర్సిటీలలోని కాంట్రాక్ట్ అధ్యాప‌కుల‌కు కనీస మూలవేతనం ఇవ్వాల‌ని విన‌తి

యూనివర్సిటీలలోని కాంట్రాక్ట్ అధ్యాప‌కుల‌కు కనీస మూలవేతనం ఇవ్వాల‌ని విన‌తి

యూనివ‌ర్శిటీల‌లో పని చేస్తున్న అధ్యాప‌కుల‌కు, నాన్ టీచింగ్ సిబ్బందికి మూల‌వేత‌నం ఇవ్వాల‌ని కోరుతూ సోమ‌వారం రాష్ట్ర ప్ర‌భుత్వ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జెఎసి రాష్ట్ర ఛైర్మెన్ ఎ.వి నాగేశ్వ‌ర‌రావు, సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఎం. బాల‌కాశి, వైస్ ఛైర్మెన్ ఎస్‌.నూర్‌మ‌హ‌మ్మ‌ద్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వై.ఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి విన‌తిప‌త్రం మెయిల్ ద్వారా పంపారు.

    రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యావ్యవస్థకు ఎంతో ప్రాధాన్యం ఇస్త్తూ నాడు`నేడు, వసతి దీవెన, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్దలాంటి పధకాల ద్వారా విద్యార్ధుల భవిష్యత్‌కు ఎంతో కృషి చేస్తూ, మౌలిక సదుపాయాలను అభివృద్ది చేస్తున్నది. మౌలిక సదుపాయాలతో పాటు విద్యాలయాల్లో ఆచార్యులు,అధ్యాపకులు, ఉపాధ్యాయులు కూడా చాలా కీలకం అన్న విషయం మీకు తెలియనదికాదు.  కాని ప్రస్తుతం యునివర్సిటీలతో సహా ప్రభుత్వ విద్యాలయాలు కాంట్రాక్టు వ్యవస్థ మీదే ఆధారపడి ఉన్నాయి. దీనిని కూడా మార్చవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
గతపాలకులు యూనివర్సిటీల్లో కూడా కాంట్రాక్టు వ్యవస్థను ప్రవేశపెట్టారు. కాంట్రాక్ట్‌ టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ ఉద్యోగులచే యునివర్సిటీలలో అతి తక్కువ వేతనాలతో పనిచేయిస్తున్నారు. వీరికి కనీసం మూలవేతనం కూడా అమలు చేయడంలేదు. ఎంతో ఉన్నత చదువులు చదివిన వారితో గౌరవ ప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో  తక్కువ వేతనాలతో పనిచేయించుకోవడం అన్యాయమే కాక అవమానపరచడమే. ఇప్ప‌టికే డిగ్రీ, జూనియర్‌, పాలటెక్నిక్‌ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు, మూలవేతనం(మినిమం టైం స్కేల్‌)అమలౌతున్నది. దీని ప్రకారం విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఆచార్యులకు మూలవేతనం అమలు చేయాలని అధికారులు సిఫారసు చేసినప్పటికీ నేటికి అమలు చేయడంలేదు.
 యునివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ సిబ్బందికి మినిమం టైం స్కేల్‌ వర్తించేలా తగు చర్యలు చేపట్టల‌ని వారు కోరారు. 
RELATED ARTICLES

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...