Thursday, April 25, 2024
Home ఆంధ్ర ప్రదేశ్ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ ర్యాంకుల్లో దిగువ నుంచి రెండో స్థానం

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ ర్యాంకుల్లో దిగువ నుంచి రెండో స్థానం

ఆంధ్రప్రదేశ్‌లో ఆహార భద్రత ప్రమాణాలు అత్యంత దిగువస్థాయిలో
ఉన్నాయి. భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) ఆహార భద్రత ఇండెక్స్‌ జాబితా 2019-21లో పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ కింద నుంచి రెండో స్థానంలో ఉంది. 100 పాయింట్లకు 36 పాయింట్లు మాత్రమే లభించాయి. ఈ మూడో ఆహార భద్రత ఇండెక్స్‌ జాబితాను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 20 పెద్ద రాష్ట్రాలు, ఎనిమిది చిన్నరాష్ట్రాలు, ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ ర్యాంకులు ఇచ్చారు. మానవ వనరులు, సంస్థాగత డేటా (20 శాతం వెయిటేజ్‌), సమ్మతి (30 శాతం), ఆహార పరీక్ష సౌకర్యం (20 శాతం), ట్రెయినింగ్‌ అండ్‌ కెపాసిటీ బిల్డింగ్‌ (10 శాతం), వినియోగదారుల సాధికారత (20 శాతం) ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు. ఎపికి ఈ అన్నింటిల్లోనూ చాలా తక్కువ మార్కులు లభించాయి.
మానవ వనరులు, సంస్థాగత డేటాలో 20 పాయింట్లకు గాను 8 పాయింట్లు, సమ్మతిలో 13 పాయింట్లు (30 పాయింట్లకు గాను), ఆహార పరీక్ష సౌకర్యంలో 3 పాయింట్లు (20 పాయింట్లుకుగాను), ట్రెయినింగ్‌ అండ్‌ కెపాసిటీ బిల్డింగ్‌లో 3 పాయింట్లు (10 పాయింట్లు), వినియోగదారుల సాధికారతలో 10 పాయింట్లకు గాను 3 పాయింట్లు లభించాయి. దీంతో 20 పెద్ద రాష్ట్రాల్లో ఏపీకి 19వ ర్యాంక్‌ లభించింది. 2019-20 ఏడాది జాబితాలో కూడా ఎపికి 18వ ర్యాంక్‌ (మొత్తంగా 42.8 పాయింట్లు) లభించింది. ఈ ఏడాది జాబితాలో గుజరాత్‌ (72 పాయింట్లు), కేరళ (70 పాయింట్లు), తమిళనాడు (64 పాయింట్లు), ఒడిషా (60 పాయింట్లు)తో ముందుస్థానంలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌ (59 మార్కులు), హిమాచల్‌ ప్రదేశ్‌ (58 మార్కులు), మధ్యప్రదేశ్‌ (57), పశ్చిమ బెంగాల్‌ (54) ఏపీ కంటే మెరుగ్గానే ఉన్నాయి.

RELATED ARTICLES

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...