Saturday, April 20, 2024
Home ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగుల స‌హ‌నాన్ని ప‌రీక్షించ‌ద్దు.

ఉద్యోగుల స‌హ‌నాన్ని ప‌రీక్షించ‌ద్దు.

తమ సమస్య చెబుదామంటే ఆర్థికశాఖ అధికారులెవరూ అందుబాటులో ఉండరని.. ఆర్థిక మంత్రి బుగ్గన ఎప్పుడూ ఢిల్లీలోనే ఉంటారన్నారు. పీఆర్‌సీ నివేదిక వచ్చి ఏడాదైంది.. పొరుగు రాష్ట్రంలో అమలు చేస్తున్నారని.. ఇక్కడెందుకు చేయరని ప్రశ్నించారు.

ఏపీ ఉద్యోగ సంఘాలు
ప్రధానాంశాలు:
ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ప్రభుత్వ ఉద్యోగులు
కష్టాలు చెబుతామంటే పట్టించుకోవడం లేదని ఆవేదన
సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం తప్పదంటూ
అమెజాన్ నవరాత్రి సేల్‌లో బ్యాగులు, వాలెట్లు & లగేజీలపై గొప్ప తగ్గింపు
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ట్విస్ట్ ఇచ్చారు.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తమ ప్రయోజనాల్ని ఇంకెంత వరకు తాకట్టు పెట్టాలని ప్రశ్నిస్తున్నారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని.. కష్టాలు చెబుతామంటే ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వంలో ఎవరికి చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నామని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోతే సమైక్యంగా పోరాడతామని హెచ్చరించారు.

ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు ఏడో తేదీకి కూడా పింఛన్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. కరోనా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఇంతకాలం ఓపికగా సహకరిస్తూ వచ్చామన్నారు. ఇంకా ఎన్నాళ్లని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల సంఘం నేతలు సీఎస్ సమీర్ శర్మను కలిసి.. వెంటనే జాయింట్‌ కౌన్సెల్‌ సమావేశం నిర్వహించి, ఉద్యోగుల సమస్యలపై చర్చించాలని కోరారు. పీఆర్‌సీ అమలు, సీపీఎన్‌ రద్దుతో సహా అన్ని అంశాలపై వినతిపత్రం అందించారు.

ఎంప్లాయీస్ వాయిస్ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మిక, విశ్రాంత ఉద్యోగులకు సమస్యలు చాలా ఉన్నాయన్నారు రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు. సీపీఎస్ రద్దు చేయకపోవడంపై ఉద్యోగులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని.. రద్దు చేయరేమోనన్న అనుమానం పెరుగుతోందన్నారు. తమ సమస్యలు పరిష్కరించండని ముఖ్యమంత్రిని అడుగుతున్నాం.. వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు.

కనీసం ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకాలని ప్రశ్నించారు ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు. తమ సమస్య చెబుదామంటే ఆర్థికశాఖ అధికారులెవరూ అందుబాటులో ఉండరని.. ఆర్థిక మంత్రి బుగ్గన ఎప్పుడూ ఢిల్లీలోనే ఉంటారన్నారు. పీఆర్‌సీ నివేదిక వచ్చి ఏడాదైంది.. పొరుగు రాష్ట్రంలో అమలు చేస్తున్నారని.. ఇక్కడెందుకు చేయరని ప్రశ్నించారు.

RELATED ARTICLES

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...