Friday, April 19, 2024
Home జాతీయం చౌకగా ప్రభుత్వ (ప్రజల) ఆస్తులు ప్రైవేట్‌ కార్పొరేట్ల పరం

చౌకగా ప్రభుత్వ (ప్రజల) ఆస్తులు ప్రైవేట్‌ కార్పొరేట్ల పరం


మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం 4 సంవత్సరాల జాతీయ మోనిటైజైషన్‌ (నగదీకరణ) పైప్‌లైన్‌ (ఎన్‌ఎమ్‌పి)ను ఇటీవల ఆవిష్కరించింది. దీని ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన రూ. 6 లక్షల కోట్లు అందు బాటులోకి వస్తాయని తెలిపింది. వాస్తవానికి ఎన్‌ఎమ్‌పి అనేది దేశంలో భారీగానున్న మౌలిక సదుపాయ రంగాలకు చెందిన ‘‘పనిచేసే ఆస్తుల్ని’’ విదేశీ బహుళ జాతి గుత్త సంస్థలతో సహా బడా కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ఉద్దేశించింది. ప్రజా ధనంతో నిర్మించిన ఆస్తుల్ని వాడుకొని భారీగా డబ్బు పోగేసుకోవడానికి బీజేపీ ప్రభుత్వం తన ఆశ్రిత పెట్టుబడి దార్లను దీనిద్వారా అనుమతిస్తుంది. భారతదేశానికి ఇటువంటి విధానమేమీ కొత్త కాదు. జాతీయ ఆస్తుల్ని ప్రైవేట్‌పరం చేసే క్రమం.. 1991లో పార్లమెంట్‌లో చెయ్యబడిన నయా ఉదార వాద విధాన ప్రకటనతో ప్రారంభమైంది. అయితే ఇందుకు అంకురం 80వ దశకం చివరలోనే పడిరది. అప్పటి నుండి వచ్చిన ప్రభుత్వాలన్నీ ప్రభుత్వ పరిశ్రమలు, సర్వీసులు, ఆర్ధికరంగం, ఖనిజ నిక్షేపాలు, మౌలికరంగ సంస్థల్ని తరతమ మోతాదుల్లో ప్రైవేట్‌పరం చేసే పనిని చేపట్టాయి. ప్రభుత్వరంగ సంస్థల యాజమాన్యాలకు ఆ సంస్థల్ని నిర్వహించే సామర్ధ్యం, నిపుణత్వం లేనందున, నష్టాలను చవి చూస్తున్నందున ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటీకరంచాల్సి వస్తోందన్న మోసపూరిత వాదనను ముందుకు తేవడం ద్వారా బడా కార్పొరేట్ల సిద్ధాంతవేత్తలు, ప్రభుత్వంలోని వారి రాజకీయ ఏజెంట్లు ఈ చర్యను సమర్ధిస్తు న్నారు. తదనంతరకాలంలో ప్రైవేట్‌ సంస్థలతో ఏ మాత్రం తీసిపోని బాగా లాభాలార్జిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలు మాత్రమే ప్రైవేటీరణకు లక్ష్యంగా చేయబడ్డాయి. వాస్తవానికి ఈ ప్రైవేటీక రణను ప్రక్రియ అనేక మార్గాల్లో చేపడుతు న్నారు. జాతీయ మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌ అనేది జాతీయ ఆస్తుల్ని కొల్లగొట్టే నీచమైన రీతిలో రూపకల్పన చేసిన తాజామార్గం. మోడీ ప్రభుత్వ నినాదం ప్రైవేటీకరించాల్సిందే!
7 సం॥ల క్రితం వచ్చిన మోడీ ప్రభుత్వం, వ్యాపారం చెయ్య డం ప్రభుత్వం పనికాదన్న వాదన ముందుకు తెచ్చి అందుకే తక్కువ మందితో ప్రభుత్వ ఏర్పాటు అని గొప్పగా చెప్పింది. ఎన్ని అడ్డంకులొచ్చినా, ఎలాగైనా ప్రైవేటీ కరించడమే తమ విధానమని దూకుడుగా ముందుకు సాగుతోంది. అయితే నయా
ఉదారవాద విధానాలు ప్రారంభమైనప్పటి నుండీ దేశంలోని కార్మికోద్యమం ఈ విధానాలను నికరంగా వ్యతిరేకిస్తోంది. ప్రైవేటీకరణకు అడ్డంకులను కల్పించి, అనేక రంగాల్లో ఈ క్రమం వేగాన్ని తగ్గించడంలో ఐక్య కార్మికోద్యమ నిరంతర, నికర జోక్యం ప్రధాన పాత్ర పోషించింది. మొత్తంగా చూస్తే ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తి స్థాయిలో ఊపందుకోలేకపోయింది. దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్ధిక నేపథ్యం కారణాన దేశీయ, విదేశీ ప్రైవేటు సంస్థలు ఆశిం చిన ఆసక్తి చూపించలేదు. గడిచిన 30 సంవత్సరాల్లో వాటాల విక్రయం ద్వారా రూ. 5.5 లక్షల కోట్లు ప్రభుత్వాలకు ఆదాయంగా రాగా అందులో ఏడేళ్ల మోడీపాలనలోనే రూ. 3.96 లక్షలకోట్లు వచ్చినప్పటికీ గుండు గుత్తగా ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌ వారికి అప్పజెప్పేద్దామన్న లక్ష్యం నెరవేర లేదు.
ప్రైవేటీకరణ లక్ష్యాలను చేరుకోవడం అసాధ్యమవడంతో మోడీ ప్రభుత్వం నేడు భారీగానున్న ప్రభుత్వాధీనంలోని మౌలిక రంగ ఆస్తులను ప్రైవేటువారికి దాదాపు
ఉచితంగా అప్పజెప్పి డబ్బులు చేసుకో వాలనుకుంటోంది. ఈ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయంలో పిసరంత వాటా తీసుకునే జూనియర్‌ భాగస్వామిగా ప్రభుత్వం ఉండ బోతోంది. అనేక రూ. లక్షల కోట్ల విలువ చేసే ‘పనిలో ఉన్న’ మౌలికరంగ ఆస్తులతో బాటు ఉత్పాదక జాతీయ ఆస్తులన్నింటినీ కారుచౌకగా దేశీయ విదేశీ ప్రైవేటు గుత్త సంస్థలకు దోచిపెట్టే నీచమైన ప్రణాళికే ఈ జాతీయ మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌!


202122 కేంద్రబడ్జెట్‌లో ప్రభుత్వం ఆస్తుల నగదీకరణపై చాలా ఎక్కువగా నొక్కి వక్కాణించింది. మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన ఆర్ధిక వనరులను సమకూర్చ డానికి, ఇది ఒక వినూత్న ప్రత్యామ్నాయ సాధనమని గొప్పగా చెప్పుకుంది. ‘పనిలో ఉన్న’ మౌలిక రంగాల ఆస్తుల నగదీకరణకు సంబంధించిన జాతీయ మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌ పథకరచనకు భూమికను బడ్జెట్‌ కల్పించింది. ఎన్‌ఎంపీపై నీతి ఆయోగ్‌ తయారు చేసిన వాల్యూమ్‌ 1లో ఎన్‌ఎంపీని ఎలా అమలు చేయ్యాలన్న మార్గదర్శకాలను పొందుపరిచారు. వాల్యూమ్‌ 2లో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఏయే కీలక మౌలిక రంగ ఆస్తుల నగదీకరణ చెయ్యాలన్నది పేర్కొన్నారు. మోసపూరిత వాదనలు పని చేసే మౌలికరంగ ఆస్తులనేవి ఎటువంటి నిర్వహణా రిస్కులు లేనివని ప్రభుత్వం వాదిస్తోంది. అంటే దీనర్ధ మేమిటి? ఇవన్నీ ప్రభుత్వ పెట్టుబడులతో నిర్మించబడిన ఆస్తులని! వాటిని పూర్తిగా పనిలో పెట్టడం కోసం, ఆదాయాన్ని లేక యూజర్‌ చార్జీలు సంపాదించడం కోసం ప్రైవేటు వారికి అప్పగిస్తున్నారు. ఈ ఆస్తులన్నీ రిస్కు లేనివని ప్రభుత్వం చెప్పడం ద్వారా, పెట్టుబడులు తిరిగి సంపాదించు కోగలమా లేదా అన్న ఆందోళన ప్రైవేట్‌ వారికి ఉండనవసరం లేదన్న భరోసా ఇస్తోంది. ఇలా చెప్పడం ద్వారా మౌలికరం గాలను మరింత అభివృద్ధి చెయ్యడానికి ప్రైవేటువారు పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపుతారని ప్రజలను నమ్మించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది ప్రజల్ని వెర్రివెం గళప్పలు చేసే మోసపూరితమైన, పూర్తిగా తప్పుడు వాదన! ఈ ఆస్తుల మీద అధికారిక యాజమాన్యపు హక్కులు లేకుండా వాటి మీద ప్రైవేటువారెందుకు తమ పెట్టుబడులను పెడతారు? వీరు ఆ విధంగా అదనపు పెట్టుబడులు పెట్టరు సరికదా ఈ మౌలిక సదుపాయాల మీద ఇష్టం వచ్చినట్లు యూజర్‌ చార్జీలను పెంచుతారు. తమ అధీనంలో ఉండే 3050 ఏళ్లలో ఎన్ని నూతన వాణిజ్య మార్గాల్లో వీటి నిర్వహణ ద్వారా వినియోగదారుల నుండి ఎక్కువ డబ్బు పిండుకుంటారు. చేజిక్కించుకొన్న మౌలిక రంగాలపై ప్రైవేటువారు పెట్టుబడి పెట్టి వాటిని మరింత విస్తరిస్తారన్న ‘‘నమ్మకాన్ని’’ ప్రజల్లో కల్పించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
నగదీకరణకు ఎంపిక చేసిన ఆస్తుల నేవి నిరుపయోగంగా పడి ఉన్న లేక పూర్తిగా నగదీకరణ కాని లేక పూర్తిగా ఉపయో గంలోకి తేబడనివని కూడా ప్రభుత్వం చెబుతోంది. ఇదిమళ్ళా మరో తప్పుడు, మోసపూరిత ప్రకటనే! దశాబ్దాల కాలంలో హైవేలు, విద్యుత్‌ ప్రసారలైన్లు, చమురు, గ్యాస్‌ పైప్‌లైన్లు, రైల్వేనెట్‌వర్క్‌లు, స్టేషన్లు, పోర్టులు, టెలికాం టవర్లను వినియెగించే వాళ్ల సంఖ్య నికరంగా పెరుగుతూ వస్తోంది. దీనితోబాటు ఈ మౌలిక రంగాల నిర్వహణ, వినియోగ స్థాయిలనేవి ఆర్ధిక వ్యవస్థ స్థితిపై ఆధారపడి ఉంటుంది. దేశంలోని విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం, తయారీ రంగాల కార్యకలాపాలపై విద్యుత్‌ ట్రాన్స్మిషన్‌ గ్రిడ్‌ నెట్‌వర్క్‌ ఉపయోగిత ముడిపడి, ఆధారపడి ఉంటుంది. దేశీయ తయారీరంగ నికర క్షీణత మూలాన తగ్గిన విద్యుత్‌ వినియో గానికి పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ను నిందిం చగలమా? ఇందుకు దోహదపడిన మోడీ ప్రభుత్వ విధ్వంసకర పాలనను ఈ నీచమైన నగదీకరణ పథకంతో సమర్ధించుకోవచ్చా!
ఎన్‌ఎంపీ అనేది పూర్తి అమ్మకం కాదన్నది ప్రభుత్వం మరో మోసపూరిత వాదన! ఒక నిర్ణీత కాల పరిమితికి వసూలు చేసుకునే హక్కులను ప్రైవేటు వారికి ప్రభుత్వం బదలాయిస్తుంది. ఇందుకు బదులుగా ప్రైవేట్‌వారు ప్రభుత్వానికి అడ్వాన్స్‌ డబ్బులు, వసూళ్లలో వాటా ఇవ్వడమేకాక ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి కట్టుబడతారు. ప్రభుత్వం ఏం చెప్పినా, కొంత అడ్వాన్స్‌ సొమ్ముకు బదులుగా జాతీయ మౌలిక రంగాలను దీర్ఘకాలం పాటు ప్రైవేటువారికి అప్ప జెప్పడమే. అడ్వాన్స్‌గా ఇచ్చే సొమ్ము కచ్చితంగా చాలా అథమంగా ఉంటుంది. జాతీయ మౌలికరంగ ఆస్తులను దాదాపు
ఉచితంగా ప్రైవేటు వారికి అప్పజెప్పే అనైతిక పద్థతి ఇది. ప్రభుత్వానికి వచ్చే అడ్వాన్సు సొమ్ము, సంవత్సరాల తరబడి వసూళ్లలో వచ్చే వాటాను మౌలిక రంగాల కల్పనకు, దేశవ్యాప్త ఉపాధి కల్పనకు ఉపయోగిస్తామని ప్రభుత్వం చెబుతోంది. లాభాలార్జించే ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చెయ్యడమనేది దేశ ఆర్ధికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు అవసరమని ప్రధాన మంత్రి ఇంతకు ముందే ప్రకటించారు. దీని ఫలితమేంటన్నది అందరికీ బాగా తెలిసిందే! ఇప్పుడు మళ్లీ దాదాపు అలాంటి ప్రకటనే చేస్తోంది.
ఆర్ధిక స్వావలంబనను, పెద్ద ఎత్తున ఉపాధిని కల్పించటంలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలూ, వాటి మౌలికరంగ ఆస్తులు కచ్చితంగా కీలకమైన పాత్ర నిర్వహించాయి. నిర్వహిస్తూనే ఉన్నాయి. ఇంతేకాక ప్రైవేటు రంగ పరిశ్రమలు, సేవారంగ సంస్థలు చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడానికి, వ్యాప్తి చెందడానికి ప్రభుత్వరంగ సంస్థలు దోహదపడ్డాయి. నేటి ఈ కసరత్తు ఏరకంగా దేశానికి, ప్రజలకు భవిష్యత్‌లో ఉపయో గపడుతుందో వివరణ లేదు. ఉద్యోగాలు కోల్పోవడం, నిరుద్యోగం పెరగడం ఖాయం.
2014లో 16 లక్షల 50 వేల మందిగా నున్న ప్రభుత్వరంగ సంస్థల
ఉద్యోగులు సంఖ్య ఏడేళ్ల మోడీపాలనలో 2020 సంవత్సరం నాటికి 9 లక్షల 80 వేలకు తగ్గిపోయింది. ఈ కసరత్తుల ద్వారా నిరుద్యోగం పెరుగుతోంది. పెద్ద పెద్ద మాటల వెనుకనున్న అసలు ఉద్దేశ్యాన్ని ఇప్పటికే గ్రహించాం.
ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోవడం, నిరుద్యోగమనేవి ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్‌ఎంపీతో ఈ పరిస్థితి మరింత దిగజారుతుంది. కోవిడ్‌కు ముందే దేశంలోని నిరుద్యోగిత రేటు గత 45 సం॥లలో మున్నెన్నడూ లేనంత ఎక్కువగా ఉంది. కోవిడ్‌ తర్వాత పరిస్థితి మరింత దిగ జారింది. కోవిడ్‌ మహమ్మారి, తత్పర్యవ సానంగా విధించబడిన లాక్‌డౌన్లు, కర్ఫ్యూల ఫలితంగా భారీ ఎత్తున ఉద్యోగాలు కోల్పోయినట్లు అందుబాటులో నున్న డేటా తెలుపుతోంది. అసంఘటిత రంగంలో పని చేసే కార్మికులు, మహిళలు చాలా ఘోరంగా దెబ్బతిన్నారు. అసంఘటితరంగ కార్మికులు, క్యాజువల్‌ వర్కర్లేగాకుండా నెలవారీ జీతాలు వచ్చే ఉద్యోగాలు కూడా ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగులను కాపాడ్డానికి గానీ ఉద్యోగాలు పోయిన వారికి నగదు బదిలీ వంటి వాటి ద్వారా వారిని ఆదుకోవడానికి గానీ బీజేపీ ప్రభుత్వం ఇసుమంత కూడా చెయ్యలేదు. కార్మిక సంఘాలు, ప్రముఖ ఆర్ధికవేత్తలు, సమాజంలోని ప్రగతిశీల సెక్షన్ల డిమాండ్లను వినిపించుకోలేదు. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో అత్యధిక మంది, ముఖ్యంగా మహిళలు వారు కోల్పోయిన ఉద్యోగాలను వారు తిరిగి పొందలేక పోయారు. ఎవరైతే పనిని పొందగలిగారో, వారు అతితక్కువ జీతాలకు, నికృష్ట పరిస్థితుల్లో పని చెయ్యాల్సి వచ్చింది. నగదీకరణకు గుర్తిం చబడిన ప్రభుత్వరంగ సంస్థల్లోని కార్మికులు ఉద్యోగాలను కోల్పోయినట్లు అనుభవాలు తెలుపుతున్నాయి. ప్రైవేటీకరణకు ఉద్దే శించబడిన ప్రభుత్వరంగ సంస్థల్లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాన్ని (వీఆర్‌ఎస్‌) ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రణాళికలను రూపొందిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. పెర్మనెంట్‌, మంచి ఉద్యోగాలను అనిశ్చిత ఉద్యోగాలు రీ ప్లేస్‌ చేస్తాయి. ఎస్పీ, ఎస్టీ, సామాజిక అణచివేతకు గురైన సెక్షన్లు
ఉపాధి అవకాశాలను కోల్పోతాయి. మోనిటైజేషన్‌కు ఉద్దేశించబడిన మౌలిక రంగ ఆస్తుల్లో అనేక వేలమంది కార్మికులు ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరందర్నీ ప్రైవేటు వారి అధీనంలోకి బదిలీచేయడం వలన, ఉద్యో గాలు నష్టపోవడానికి అనివార్యంగా అది దారితీస్తుంది. ఇంతేగాక ఉపాధి నాణ్యత చాలా ప్రమాదకరంగా క్షీణిస్తుంది.
ప్రజా ఆస్తులను కార్పొరేట్లు చేజిక్కించుకుంటున్నారు
ప్రైవేటీకరించబడుతున్న రంగాల వివరాలు చూద్దాం. జాతీయ మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపీ) డాక్యుమెంట్‌ ప్రకారం:
రోడ్లు: ఈ రోజుకి నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధీనంలో 1,32,499 కిలోమీటర్ల రోడ్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులోని 26,700 కిలోమీటర్ల రోడ్లను 202225 మధ్య రూ. 1.6 లక్షల కోట్ల విలువకు నగదీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇది జాతీయ రహదారుల్లో (ఎన్‌హెచ్‌ఎస్‌) 22 శాతం. రైల్వేలు: భారతీయ రైల్వేలు 7,325 స్టేషన్లు, 1,26,366 కిలోమీటర్ల ట్రాక్‌ నెట్‌వర్క్‌, 67,956 కిలోమీటర్ల పాసింజర్‌ రైళ్ళు రూట్‌లెంగ్త్‌, 13,169 పాసింజర్‌ రైళ్ళు, 1,246 గూడ్స్‌షెడ్స్‌, 5 పర్వత ప్రాంత రైల్వేలు, అనేక రైల్వే స్టేడియంలు, రైల్వే కాలనీలు, తూర్పు పశ్చిమ ప్రాంత రైల్వేల్లో 2,843 కిలోమీటర్ల పొడవైన ఫ్రైట్‌ కారిడార్‌ను కలిగి ఉన్నాయి. 202225 సంవత్సరాల్లో నగదీకరణకు గుర్తించబడిన కీలక రైల్వే ఆస్తులు 400 రైల్వే స్టేషన్లు, 90 పాసింజర్‌ ట్రైన్లు, ఒక రూట్‌కు చెందిన 1,400 కిలోమీటర్ల రైల్వేట్రాక్‌, కొంకణ్‌ రైల్వే 741 కిలోమీటర్ల, 15 రైల్వే స్టేడియంలు, ఎంపిక చేయబడిన రైల్వే కాలనీలు, రైల్వేకు చెందిన 265 గూడ్స్‌షెడ్స్‌, 4 పర్వత రైల్వేలు. వీటన్నింటి నగదీకరణ విలువ రూ. లక్షా 52 వేల 496 కోట్లు.

ఎయిర్‌పోర్టులు: ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియాకు చెందిన 137 మేజర్‌ ఎయిర్‌ పోర్టుల్లో 25 ఎయిర్‌ పోర్టులు నగదీకరణకు ఎంపిక చేయబడ్డాయి. అందులో చెన్నై, వారణాశి, నాగ్‌పూర్‌, భువనేశ్వర్‌, ఉదయ్‌పూర్‌, డెహ్రాడూన్‌, ఇండోర్‌, రాంచీ, కోయం బత్తూరు, జోధ్‌పూర్‌, వడోదర, పాట్నా, విజయవాడ, తిరుపతి ఉన్నాయి. వీటి నగదీకరణ ద్వారా రూ. 20,782 కోట్లు సంపాదించాలి. ముంబయి, ఢల్లీి, బెంగళూరు, హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుల్లో మిగిలిపోయిన ప్రభుత్వ వాటాను అమ్మెయ్యాలి.

విద్యుత్‌ ట్రాన్స్మిషన్‌: 2025 నాటికి విద్యుత్‌ ట్రాన్స్మిషన్‌ లైన్లను నగదీకరించడం ద్వారా రూ. 45,200 కోట్లు సంపాదిం చాలని ప్రభుత్వ లక్ష్యం. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌కు చెందిన 1,71,950 కిలోమీటర్ల ట్రాన్స్మిషన్‌ లైన్లలో 28,608 సర్క్యూట్‌ కిలోమీటర్ల లైన్లు, వాటికి అనుబంధంగా ఉండి 4,44,738 ఎం.వి.ఏ. ట్రాన్స్మిషన్‌ సామర్ధ్యం కలిగిన 262 సబ్‌స్టేషన్లను నగదీకరించడానికి ప్రభుత్వం పూనుకుంది.

బొగ్గుగనుల ఆస్తులు: రూ. 28,747 కోట్లు విలువైన 160 బొగ్గు గనుల ఆస్తులను నగదీకరణ కోసం ప్రభుత్వం గుర్తించింది. టెలికాం ఆస్తులు: రూ. 35100 కోట్లు విలువైన టెలికాం ఆస్తులను నగదీకరణ కోసం ప్రభుత్వం గుర్తించింది. బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌కు మొత్తం 69,047 టెలికాం టవర్లున్నాయి. ఇందులో 14,197 టవర్లు అంటే మొత్తం టవర్లలో 21 శాతాన్ని, భారత్‌ నెట్‌వర్క్‌కు చెందిన 5,25,706 కిలోమీటర్ల ఆప్టికల్‌ ఫైబర్‌లో 2,86,000 కిలోమీటర్లను ప్రభుత్వం నగదీకరించుతోంది. హై స్పీడ్‌ బ్రాడ్‌ బ్యాండ్‌తో దేశంలోని గ్రాములన్నింటినీ అనుసంధానించడానికి భారతనెట్‌, ఆప్టికల్‌ ఫైబర్‌ను వేసింది. విత్యుత్‌ ఉత్పత్తి: రూ. 39,832 కోట్లు విలువ కలిగిన 6 గిగావాట్స్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేసే జల, రెన్యువబుల్‌ ఎనర్జీ ఆధారిత విద్యుత్‌ సంస్థలను నగదీకరణకు గుర్తించారు. ఇందులో ఎన్‌టీపీసీకి చెందిన 4912 మెగావాట్లు ఉత్పత్తి చేసే జల, సౌర్య ఉత్పత్తి కేంద్రాలు, ఎన్‌హెచ్‌పీసీకి చెందిన 7,071 మెగావాట్లు ఉత్పత్తిచేసే జల, వాయు, సౌర్య విద్యుత్‌ ఉత్పత్తి చేసే కేంద్రాలు ఉన్నాయి. పెట్రోలియం, ఉత్పత్తుల పైప్‌లైన్లు: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌), హిందూస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌), గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (జీఎఐఎల్‌)లకు 17,432 కిలోమీటర్ల పొడవు కలిగిన పెట్రోలియం ఉత్పత్తుల పైపులైన్లు, ఎల్‌పీజీ పైప్‌లైన్లు ఉన్నాయి. ఇందులో రూ. 22,503 కోట్లు విలువ కలిగిన 3,930 కిలోమీటర్ల పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీ పైపులైన్లను నగదీకరణకు గుర్తించారు. సహజవాయువు: దేశంలో 16900 కి॥ మీ॥ పొడవు కలిగిన సహజవాయు పైపులైన్లు ఉన్నాయి. వీటి డిజైన్‌ సామర్ధ్యం 400 ఎంఎంఎస్‌ఈఎండీ. మరో 18,363 కిలోమీటర్ల పొడవు కలిగిన సహజవాయు పైప్‌లైన్ల నిర్మాణానికి ఆమోదం తెలపడం గానీ నిర్మాణ దశలో గానీ ఉన్నాయి. రాబోయే 3 లేక 5 సంవత్సరాల్లో నేచరల్‌ గ్యాస్‌ గ్రిడ్‌ ఆఫ్‌ ఇండియా పైప్‌లైన్లు 35,263 కిలోమీటర్లకు విస్తరించవచ్చని అంచనా. రూ. 24,462 కోట్ల విలువ కలిగిన 8,154 కిలోమీటర్ల పొడవైన సహజ వాయు పైప్‌లైన్లను నగదీకరణకు ఎంపిక చేశారు. షిప్పింగ్‌ ఆస్తులు: మన దేశానికన్నా 7,500 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతంలో మనకు 12 మేజర్‌ పోర్టులు, 200 మేజర్‌ కాని పోర్టులున్నాయి. మనకు విస్తారమైన జలమార్గ నెట్‌వర్క్‌ ఉంది. దీని నిర్వహణా సామర్ధ్యం 1,535 ఎంఎంటీపీఏ. 9 మేజర్‌ పోర్టులకు చెందిన రూ. 12,828 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులు నగదీకరణకు ఎంపికయ్యాయి. గిడ్డంగుల ఆస్తులు: ఎఫ్‌సీఐ, సెంట్రల్‌వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌లకు చెందిన 210 లక్షల టన్నుల నిల్వ సామర్ధ్యం కలిగిన గిడ్డంగులను (ఎఫ్‌సీఐ, సీడబ్ల్యూసీల మొత్తం నిల్వ సామర్ధ్యంలో 39 శాతం) నగదీకరణకు గుర్తించారు. వీటి విలువ రూ. 28,900 కోట్లుగా అంచనా వేశారు. రియల్‌ ఎస్టేట్‌, హోటల్‌ ఆస్తులు దేశ రాజధానిలో 7 హౌసింగ్‌ కాలనీలు, 8 ఐటీడీసీ హోటల్స్‌ నగదీక రణకు గుర్తించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం మరియు 3 ఇతర ఎస్‌ఎఐ ఆస్తులు ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంను కూడా విడిచిపెట్టలేదు. మరో జాతీయ స్టేడియంÑ బెంగళూర్‌, జికర్‌పూర్‌లలోని స్టోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఏఐ)కు చెందిన 2 ప్రాంతీయ కేంద్రాల ఆస్తులు నగదీకరణకు ఎంపిక చెయ్యబడ్డాయి. వీటి విలువ రూ. 11,450 కోట్లుగా అంచనా. సంవత్సరాల వారీగా నగదీకరణ లక్ష్యాలు: సంవత్సరం రూ. కోట్లలో 202122 88,190 202223 1,62,422 202324 1,79,544
202425 1,67,345 అతితక్కువగా వెలకట్టడం ఒక విషయాన్ని మదిలో ఉంచు కోవాలి. రూ. 6 లక్షల కోట్ల విలువగల మౌలికరంగాల ఆస్తులను నగదీకరణకు పెట్టారంటే దానర్ధం అంత సొమ్ము ప్రభుత్వ ఖజానాకు అడ్వాన్సుగా జమ అవుతుందని అర్ధం కానేకాదు. ఇంతకు ముందే చెప్పినట్లు ఈ ఆస్తుల విలువలు చాలా చాలా అతితక్కువగా అంచనా వేయబడ్డాయి. ఈ రోజు ధరవరల ప్రకారం ఆస్తుల మూలధర వ్యయంతో ఇప్పుడు నగదీకరణ సాక్షాత్కారం కోసం ఉద్దేశించిన ధరను పోల్చితే చాలా సులువుగా ఈ విషయం అవగతమౌతుంది. నేషనల్‌ హైవేల్లో 22 శాతం అంటే 26,700 కిలోమీటర్ల రోడ్లను నగదీకరిస్తు న్నారు. దీని ద్వారా రూ. 1.6 లక్షల కోట్లు అడ్వాన్సు ధరగా రావొచ్చని ప్రభుత్వం ప్రకటించింది. కానీ అంత భారీగా రోడ్లను వెయ్యడానికి అయిన మూలధన ఖర్చు ఎంత? రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ రికార్డుల ప్రకారం మూడేళ్ళ క్రితం వరకు ఒక కిలోమీటర్ల రెండు లైన్ల రోడ్డు వెయ్యడానికి 11 నుండి 12 కోట్లు రూ॥లు అవుతుంది. నాలుగు లైన్ల రోడ్డుకు కిలోమీటర్‌కు రూ. 30 కోట్లు వ్యయమవు తుంది. ఈ వ్యయం మూడేళ్ళలో సంచితంగా 30 శాతం పెరిగింది. (పయనీర్‌ పత్రిక 18.10.19). 2019లో అంచనా కట్టబడిన మూలధన వ్యయాన్నే ఈ రోజుకీ ఉందని అనుకుంటే 4 లైన్లు కలిగిన 26,700 కిలోమీటర్ల జాతీయ రహదారుల వెల రూ. 8 లక్షల కోట్లు కన్నా తక్కువ ఉండదు. అంటే రూ. 8 లక్షల కోట్ల విలువ కలిగిన ఆస్తులను ప్రభుత్వం తనకునచ్చిన వారికి రూ. 1.6 లక్షల కోట్లు ముందస్తు ఫీజుకు ఇచ్చేస్తోంది. ప్రభుత్వంతో కుమ్మక్కై, ప్రైవేటు ఆపరేటర్లు బేరసారాలాడి ఈ ముందస్తు ఫీజును మరింతగా కచ్చితంగా తగ్గిస్తారు. ఇంతేగాక, ప్రైవేటు ఆపరేటర్లు ఎన్ని టోల్‌ప్లాజాలు అయినా పెట్టుకోవడానికీ ఎంతయినా సొమ్ము వసూలు చేసుకోవ డానికి వారికి ప్రభుత్వం అధికారం ఇస్తుంది. ఎటువంటి అదనపు పెట్టుబడి పెట్టకుండానే వచ్చిన ఆదాయంలో 7080 శాతం వరకు ప్రైవేటు ఆపరేటర్లు చేజిక్కించుకునేట్లు ఆదాయ పంపిణీ ఒప్పందాలు ఉంటాయి. అలాగ, ఒక పక్క ప్రజా ధనంతో నిర్మించబడిన జాతీయ మౌలికరంగ ఆస్తులను కార్పొరేట్లకు పంచి పెట్టడంతో బాటు మరోవైపు కార్పొరేట్లు భారీ యూజర్‌ చార్జీలను, టోల్‌ ఫీజులను సామాన్యుల నుండి జలగల్లా పిండుకుంటారు.
అదేరీతిలో, సహజవాయువుకి చెందిన పైప్‌లైన్లలో 50 శాతం అంటే 8,154 కిలోమీటర్ల పొడవు కలిగిన పైప్‌లైన్లను రూ. 24,642 కోట్ల ముందస్తు ఫీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 5 వేల కిలోమీటర్ల సహజ వాయు పైప్‌లైన్‌ వెయ్యడానికి రూ. 25 వేల కోట్ల మూలధన వ్యయమవు తుందని గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (జీఏఐఎల్‌) పూర్వపు చైర్మన్‌ Ê మేనేజింగ్‌ డైరెక్టర్‌ 2018 ఆగస్టులో అధికారికంగా తెలిపారు. అంటే కి॥మీ కు రూ. 5 కోట్లు ఖర్చు అయ్యింది. ఈ రోజు కూడా అదే వ్యయం అవుతుందని అనుకుంటే 8,154 కిలోమీటర్ల పైప్‌లైన్‌ వెయ్యిడానికి అయ్యే మూలధన వ్యయం రూ. 40 వేల కోట్లు పైనే అవుతుంది. సహజవాయువును పైప్‌లైన్‌ ద్వారా రవాణా చెయ్యడానికి విధించే టారిఫ్‌ను ప్రస్తుతం సహజ వాయు నియంత్రణ బోర్డు నిర్ణయిస్తోంది.
రాబోయే రోజుల్లో దీనిని రద్దు చెయ్యరన్న గ్యారెంటీ లేదు. సర్వీసు చార్జీలెంతుండాలన్న నిర్ణయం చేసే అధికారం కార్పొరేట్లకు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకసారి ఆస్తుల్ని పంచిపెట్టిన తర్వాత, చార్జీలు భారీగా పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీని వలన సామాన్య ప్రజలే తీవ్రంగా దెబ్బతింటారు. ఎందుకుంటే పైప్‌లైన్ల ద్వారా సరఫరా అయ్యే సహజ వాయువు పై విధించే యూజర్‌ చార్జీలు భారీగా పెరిగిన తర్వాత ఈ సహజ వాయువును ఉపయోగించి తయారయ్యే దాణా లేక ఇంధనం ధరలు విపరీతంగా పెరుగుతాయి. ప్రతిష్టాత్మక జీఏఐఎల్‌ను మడతపెట్టెయ్యాలన్నది ప్రభుత్వ అంతిమ ఉద్దేశమని దీన్ని బట్టి ఇట్టే అర్ధమవుతోంది. అంతకీ అయితే కొత్తగా అభివృద్ధి చేసే గ్రీన్‌ఫీల్డ్‌ మౌలికరంగాన్ని ప్రభుత్వం అట్టేపెట్టుకుని, అభివృద్ధి చేసిన తర్వాత తిరిగి (దాదాపు ఉచితంగా) కార్పొరేట్లకు పంచిపెట్టేస్తుంది.
నగదీకరణకు గుర్తించబడిన ఇతర మౌలికరంగ ఆస్తుల విషయంలో కూడా ప్రభుత్వ ఖజానాను పట్ట పగలు దోపిడీకి ఈ రకంగానే పథక రచన చేసింది. రూ. 1.5 లక్షల కోట్ల ముందస్తు సొమ్ముకు 400 రైల్వే స్టేషన్లు, 90 ప్యాసింజర్‌ ట్రైన్లు, 1,400 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌లు, 741 కిలోమీటర్ల కొంకణ్‌ రైల్వే, 15 రైల్వే స్టేడియంలు, ఎంపిక చేయబడిన రైల్వే కాలనీలు, 265 రైల్వే గూడ్స్‌ షెడ్లు, 4 పర్వతప్రాంత రైల్వేలను అప్పగిస్తారు. 20,782 కోట్ల రూపాయలకు బదులుగా భారీగా ప్రజాధ నాన్ని వెచ్చించి అత్యంత అధునాతనంగా నిర్మించిన 25 ఎయిర్‌ పోర్టులను ఇచ్చేస్తారు. రూ. 28,747 కోట్లకు ప్రతిగా భారీగా బొగ్గు నిల్వలు కలిగిన 160 బొగ్గు గనులను, రూ. 22,503 కోట్లు ఆశించి 3,930 కిలోమీటర్ల పెట్రోలియం పైపులైన్లను, రూ. 12,828 కోట్లకు ప్రతిగా 9 మేజర్‌ పోర్టులకు చెందిన 31 ప్రాజెక్టులను, రూ 28,900 కోట్లకు బదులుగా 210 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్ధ్యం ఉన్న ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్లు గిడ్డంగులను కార్పొ రేట్లకు కట్టబెడతారు. ఆస్తుల నగదీకరణ పేరుతో జాతీయ ఖజానాను పట్టపగలు కొల్లగొట్టడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే!
ఇంకా ఇలాంటి అనేకం ఉటం కించవచ్చు. నగదీకరణకు నిర్ణయిం చబడిన ప్రతి మౌలికరంగ ఆస్తి విలువ అతి తక్కువగా నిర్ణయించబడిరదన్నది అర్ధం చేసుకోవడం కష్టమైన విషయం కానే కాదు. ప్రైవేటు సంస్థల ద్రవ్య లాభాల కోసం ఆస్తుల యాజమాన్యాన్ని నగదీకరణ ముసుగులో బదిలీచేయాలన్నది బీజేపీ ప్రభుత్వ ఉద్దేశమని తేటతెల్లమవుతోంది. అందువలన ప్రభుత్వ ఖజానాకు ఎంత వస్తుందన్న ఆందోళనతో బీజేపీి ప్రభుత్వం తన నిద్రను చెడగొట్టుకోదల్చుకోలేదు.
1991లో ప్రవేశపెట్టిన నయా ఉదా రవాద విధానాలను, వాటాల ఉపసం హరణ, ప్రైవేటీకరణల పేరుతో జాతీయ
ఉత్పాదక ఆస్తులను ప్రైవేటు కార్పొరేట్లు కొల్లగొట్టుకునే వికృత తత్త్వశాస్త్రాన్ని కూడా తమతోపాటు తెచ్చాయి. కార్మికవర్గ ఉద్యమం నికరమైన వ్యతిరేకత కారణాన గత రెండు దశాబ్దాల్లో వాటాల ఉపసంహరణ ప్రక్రియ తగినంత వేగంతో జరగలేదు. గుండుగుత్త ప్రైవేటీకరణ కూడా 9 లేక 10 ప్రభుత్వ రంగ సంస్థలకే పరిమితమైంది.


ప్రైవేటీకరణబీజేపీ భావజాల నిబద్ధత స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి ఈ ఏడు దశాబ్దాల కాలంలో నిర్మించిన విస్తారమైన ప్రభుత్వరంగ నెట్‌వర్క్‌ పునాదుల మీద ఆధారపడి స్వావలంబన కలిగిన జాతీయ అర్ధిక వ్యవస్థ అభివృద్ధి అయ్యింది. కానీ పచ్చి మితవాద బీజేపీ ప్రభుత్వం ఇటువంటి అభివృద్ధి పట్ల శత్రుపూరిత వైఖరి కలిగి ఉంది. మౌలికరంగం, పరిశ్రమలు, ప్రజోపయోగ సేవారంగాల్లో నెలకొల్పిన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ, ఎలాగైనా, ఏ మార్గంలోనైనా ప్రైవేటీకరిస్తోంది. బీజేపీ ప్రభుత్వ చర్యల వలన జాతీయ ఆర్ధిక వ్యవస్థ, ప్రజలపై పడే విధ్వంసకర ప్రభావం గురించి అది పూర్తిగా ఖాతరు చెయ్యటం లేదు. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ నేరుగా అమ్మేద్దామనుకున్న మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రాజెక్టు వారనుకున్న రీతిలో విజయవంతం కాలేదు. ఇందుకు అనేక కారణాలతో బాటు ప్రైవేటీకరణకు వ్యతి రేకంగా కార్మికులు దృఢదీక్షతో సల్పిన ఐక్య పోరాటాలూ ముఖ్య కారణమే. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాధనంతో నిర్మించిన భారీ మౌలికరంగ ఆస్తుల్ని దాదాపు ఉచితంగా, వసూళ్లలో పిసరంత వాటాకు బదులుగా ప్రైవేటు కార్పొరేట్‌ తిమింగలాలకు ఇచ్చే యాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించడం అత్యంత అసంబంద్ధం. భారీ మౌలిక రంగాల అభివృద్ధికి ఒకపైసా కూడా మదుపు పెట్టని కార్పొరేట్‌ దోపిడి దొంగలను, వాటిని అట్టే పెట్టుకోవ డానికి, నిర్వహించడానికి, వాటి ద్వారా వచ్చే రాబడిలో సింహభాగాన్ని జేబులో వేసుకోవ డానికి అనుమతించడం జరుగుతోంది. ప్రభుత్వ, కార్పొరేట్లు పూర్తిగా కుమ్మక్కై అమలవుతున్న నేషనల్‌ మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌ అని పిలిచే అనైతిక ఆవిష్కరణతో ఆశ్రిత పక్షపాతం గరిష్ట స్థాయికి చేరింది. కార్పొరేట్‌ దాతలకు తిరిగి చెల్లించడం 201718 సంవత్సరంలో కార్పొరేట్లు ఇచ్చిన విరాళాల్లో ఏ కారణం లేకుండానే ఏ కారణం లేకుండానే 92 శాతం పాలక పార్టీ దక్కించుకోలేదు. దీనినే మరోవిధంగా చెప్పాలంటే 201718లో కార్పొరేట్లు వ్యాపార వర్గాలు ఇతర పార్టీలతో పోలిస్తే 12 రెట్లు అధికంగా పాలక బీజేపీకి విరాళంగా ఇచ్చాయి.(ఆధారం: అబ్జర్వర్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ ఓఆర్‌ఎఫ్‌). 2014 నుండి 2018 వరకు ఇచ్చిన విరాళాలను లెక్కలోకి తీసుకుంటే పాలక పార్టీకి రోజుకి రూ. 10 కోట్లు చొప్పున విరాళంగా అందుకుందని ప్రసారమాధ్యమాల్లో నివేదించబడిరది. దీనికి బదులుగా మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వారికి తిరిగి చెల్లించిందేమిటి? 2016లో పెద్దనోట్ల రద్దు, 2017లో తీసుకొచ్చిన జీఎస్టీ, 2018లో రూ. లక్షా 46 వేల కోట్ల మేరకు కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపు! రాజకీయ విరాళాలిచ్చిన దాతల పేర్లు బయట పెట్టినప్పటికీ ప్రభుత్వరంగ వాటాల ఉపసంహరణ ద్వారా ప్రయోజనం పొందిన కార్పొరేట్‌ వ్యాపార వర్గాలే బీజేపీకి విరాళాలిచ్చేరన్నది ముఖమూ అద్దంలా సుస్పష్టం. వారికే మళ్లీ దేశంలోని భారీ మౌలికరంగ ఆస్తులను కొల్లగొట్టుకోవ డానికి, దోచుకోవడానికి తలుపులు బార్లా తెరవబడ్డాయి.
కానీ దొంగలు, దోపిడీదార్లదే అంతిమ వాక్కు కాబోదు. ప్రభుత్వరంగ సంస్థల తెగనమ్మడానికి అడ్డంకులు సృష్టించిన కార్మికోద్యమమే దేశం ఆస్తులు, ప్రజలపైన జరుగుతున్న విచ్ఛిన్నకర దాడిని అడ్డుకుంటుంది. నేషనల్‌ మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌ పేరుతో దూకుడుగా అమలవబోతున్న ప్రణాళికను నిరోధించే నిర్ణయాత్మకపు ప్రతిఘటనను అభివృద్ది చెయ్యడమే మనందరి ముందు, ముఖ్యంగా మౌలిక రంగాల్లోని కార్మికోద్యమం, ప్రజాతంత్ర ఉద్యమం ముందూ ఉన్న కర్తవ్యం.
‘‘జాతీయ ఆస్తుల్ని కొల్లగొట్టే జాతివ్యతిరేక ప్రణాళికను ఆరునూరైనా అనుమతించం.!!’’

– నిషిత్‌ ఛౌదురి

RELATED ARTICLES

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

పాత సర్వీస్ రూల్స్‌నే కొనసాగించాలి: విద్యుత్ ఉద్యోగుల జేఏసీ

స‌చివాల‌యం ప్ర‌తినిధి: ఉద్యోగుల కోసం డిస్కమ్‌లు పాత సర్వీస్ రూల్స్‌నే కొనసాగించాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. జేఏసీతో మంత్రి బాలినేని, సజ్జల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...